Israel: ఉద్రిక్త పరిస్థితులు.. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం
ఊహించినట్లుగానే యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా రాకెట్ల వర్షం కురిపించింది. దాదాపు 50కి పైగా కట్యూషా రాకెట్లతో ఆదేశం పై విరచుకుపడింది. ఈ దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎంతమంది మరణించి ఉండొచ్చనేది దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనతో ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతం అట్టుడికిపోతోంది. కాగా ఈ రాకెట్ల దాడిని ఇజ్రాయెల్ సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు తెలుస్తోంది. దీని కోసం అమెరికా సాయం చేసినట్లు సమాచారం.
ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ కూడా లెబనాన్ భూభాగంపై గల కిలా, డెర్ సిర్యాన్ ప్రాంతాలపై రాకెట్లతో ప్రతిదాడి చేసింది. ఈ దాడుల్లో ఒకరు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. ఇటీవల హెబ్బొల్లా జరిపిన రాకెట్ దాడిలో 12 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించిన విషయం తెలిసిందే.