LOADING...
Nigeria: నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం.. 60 మంది మృతి  
నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం.. 60 మంది మృతి

Nigeria: నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం.. 60 మంది మృతి  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2025
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర మధ్య నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. వంద మందితో ప్రయాణిస్తున్న పడవ నీట మునగడంతో 60 మంది మృతి చెందారు. మలాలే జిల్లాలోని తుంగన్ సులే ప్రాంతం నుండి బయలుదేరిన పడవ గౌసావా కమ్యూనిటీ సమీపంలో ఒక చెట్టు మొద్దును ఢీకొనడంతో బోల్తా పడింది. స్థానిక ప్రభుత్వ ప్రాంత చైర్మన్ అబ్దుల్లాహి బాబా అరా మీడియాతో మాట్లాడుతూ, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. క్షతగాత్రులను కాపాడటానికి సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రమాదంలో 60 మంది మృతి చెందినట్టు అధికారులు పేర్కొన్నారు. అలాగే, పది మంది పరిస్థితి విషమంగా ఉందని, గల్లంతైన వారి కోసం వెదుకులాట జరుగుతున్నదన్నారు.

వివరాలు 

 50 మందిని రక్షించాం: నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ

షాగుమి జిల్లా అధికారి సాదు ఇనువా మొహమ్మద్ మాట్లాడుతూ, ప్రమాదం సంభవించిన కొద్దిసేపటే తాను సంఘటన స్థలానికి చేరుకున్నట్లు చెప్పారు. ప్రమాద సమయంలో పడవలో మొత్తం వంద మంది ప్రయాణిస్తున్నారని, తొలుత 31 మృతదేహాలను వెలికితీశారన్నారు. గల్లంతైనవారి కోసం అత్యవసర సిబ్బంది వెదుకుతున్నారని నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. ఇప్పటివరకు 50 మందిని రక్షించారని తెలిపింది. పడవలో ఎక్కువ మంది ప్రయాణించటం, చెట్టు మొద్దును ఢీకొట్టటం కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. నైజీరియాలో, ముఖ్యంగా వర్షాకాలంలో, భద్రతా పరిపాలన లోపాలు, సరైన నిర్వహణలేని ఓడల వాడకం కారణంగా ఇలాంటి పడవ ప్రమాదాలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం