South Korea: దక్షిణ కొరియాలో రోడ్డు దాటుతున్న వారిపై వేగంగా వెళ్లిన కారు.. 9 మంది మృతి.. నలుగురికి గాయలు
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో వేగంగా వెళ్తున్న కారు రోడ్డు దాటేందుకు నిలబడి ఉన్న వ్యక్తులపైకి దూసుకెళ్లడంతో 9 మంది మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 21:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. Yonhap వార్తా సంస్థ నివేదిక ప్రకారం, 60 ఏళ్ల వ్యక్తి తన వాహనాన్ని ట్రాఫిక్ స్టాప్ వద్ద వేచి ఉన్న పాదచారులపైకి నడిపాడు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం,కారు రాంగ్ సైడ్‌లో వెళ్తూ మరో రెండు వాహనాలను ఢీకొని పాదచారులను చితక్కొట్టింది.
ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
సియోల్ సిటీ హాల్ సమీపంలోని కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కారు అకస్మాత్తుగా వేగవంతమైందని అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్న డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దక్షిణ కొరియాలో సాధారణ పట్టణ రహదారులపై వేగ పరిమితి 50 km/h (31 mph), నివాస ప్రాంతాలలో 30 km/h. సెంట్రల్ సియోల్‌లోని జాంగ్-గు జిల్లాలో పబ్లిక్ సేఫ్టీ అధికారి కిమ్ సియోంగ్-హక్ మాట్లాడుతూ, పోలీసులు కారు డ్రైవర్‌ను విచారిస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా లేక డ్రగ్స్ మత్తులో ఉన్నాడా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
2022లో దక్షిణ కొరియా రోడ్డు మరణాలలో 35% పాదచారులు
జంగ్బు ఫైర్ స్టేషన్ ఫైర్ సేఫ్టీ చీఫ్ కిమ్ చున్-సు ప్రకారం, ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు, వారిలో 9 మంది మరణించారు. ఒకరికి తీవ్రగాయాలు కాగా, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD) నివేదిక ప్రకారం, 2022లో దక్షిణ కొరియాలో జరిగిన రోడ్డు మరణాలలో 35% పాదచారులు - ఇతర దేశాల కంటే చాలా ఎక్కువ. కానీ అదే నివేదికలో, OECD ఇటీవలి సంవత్సరాలలో దేశంలో రోడ్డు మరణాల రేటు తగ్గిందని హైలైట్ చేసింది.