Hezbollah: హెజ్‌బొల్లా ఆర్మీ బేస్‌పై దాడి.. ఐడీఫ్ ఆర్మీ చీఫ్ మృతి అంటూ ప్రచారం
బిన్యమిన ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై హెజ్‌బొల్లా అనుమానిత మనవరహిత విమానాలు దాడి చేశాయి. ఈ దాడిలో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతిచెందగా, 67 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. మొదటగా ఐడీఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జిహలేవి మృతి చెందినట్లు ప్రకటించారు. అయితే జెరూసలెం ఈ సమాచం తప్పు అని పేర్కొంది. దాడి జరిగిన ప్రాంతం ఐడీఎఫ్ గోలాన్ బ్రిగేడ్ శిక్షణ శిబిరంలోని మెస్ అని తెలుస్తోంది. అనేక డ్రోన్లు ఒకేసారి విరుచుకుపడటంతో ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పనిచేయలేదు. ఐడీఎఫ్ ప్రతినిధి హగారీ ఈ దాడిపై స్పందిస్తూ, తమకు ఈ యుద్ధంపై పూర్తి పట్టు ఉందని చెప్పారు.
సమర్థవంతంగా స్పందించలేకపోయిన ఇజ్రాయెల్
ఈ దాడికి ఉపయోగించిన మానవ రహిత విమానాలను ఎలా పరిక్షించలేక పోయామో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. హెజ్‌బొల్లా ఈ దాడికి ఉపయోగించిన డ్రోన్లు మిర్సాద్-1 శ్రేణికి చెందినవి. ఇవి 120 కిలోమీటర్ల దూరంలో గంటకు 370 కిలోమీటర్ల వేగంతో టార్గెట్ ను లక్ష్యంగా చేసుకోవచ్చని నిపుణులు వెల్లడించారు. ఈ డ్రోన్లలో 40 కిలోల పేలుడు పదార్థాలను అమర్చడం, 3,000 మీటర్ల ఎత్తుకు ఎగరడం సామర్థ్యం ఉంది. ఈ మొహాజిర్-2 శ్రేణికి చెందిన సూసైడ్ డ్రోన్, హెజ్‌బొల్లా ప్రధాన డ్రోన్, 2002 నుంచి ఉపయోగిస్తున్నారు. హెజ్‌బొల్లా భారీ సంఖ్యలో రాకెట్లతో కలిసి ఈ డ్రోన్లను ప్రయోగించడంతో ఇజ్రాయెల్ సమర్థంగా స్పందించలేకపోయింది.