
Zelensky: స్వదేశీ ఆయుధాలతోనే రష్యాపై దాడి : జెలెన్‌స్కీ
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ తన దేశీయ ఆయుధ ఉత్పత్తిని గణనీయంగా పెంచింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelensky) ప్రకారం, యుద్ధంలో ఉపయోగిస్తున్న ఆయుధాల 60 శాతం తమ దేశంలోనే తయారు చేస్తోన్నట్లు తెలిపారు. ఇతర దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటూనే, స్వదేశీ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన పేర్కొన్నారు. సంఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ, కీవ్ అత్యాధునిక ఆయుధాలను తయారు చేసే స్థాయికి ఎదిగిందని, ఇది గర్వకారణమని చెప్పారు. అయితే సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా ఉన్నాయని, ప్రస్తుతం గగనతల రక్షణ వ్యవస్థల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీర్ఘశ్రేణి ఆయుధాలు, క్షిపణుల కొరకు మిత్ర దేశాలతో త్వరలో చర్చలు జరగనుందని వెల్లడించారు.
Details
2025 బడ్జెట్‌లో భారీ కేటాయింపులు
రష్యా దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, ఉక్రెయిన్ దేశీయ రక్షణ పరిశ్రమలను విస్తరించింది. తాజాగా గగనతల రక్షణ వ్యవస్థలు, రెండు కొత్త బాలిస్టిక్ క్షిపణులు అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు. విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గించడానికి 2025 బడ్జెట్‌లో భారీ కేటాయింపులు కూడా చేసారు. చైనా పర్యటన అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్, జెలెన్‌స్కీని మాస్కోకు ఆహ్వానించారు, యుద్ధం ముగింపుపై చర్చలు జరపడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు కివ్‌లోని ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టే ఆ ఉగ్రరాజధానిలో తాను ఎప్పటికీ కాలు పెట్టనని స్పష్టం చేశారు. చర్చలను ఆలస్యం చేయడానికి పుతిన్ రాజకీయ యుక్తులను ఉపయోగిస్తున్నారని, అమెరికాతో కూడా ఆటలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Details
ఉక్రెయిన్ దాడులను కొనసాగిస్తున్న రష్యా
ఒకవైపు శాంతి ఒప్పందం దిశగా చర్చలు జరుతున్నప్పటికీ, రష్యా ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తోంది. ఆదివారం కీవ్‌లోని పలు ప్రాంతాలపై రష్యా దాడుల్లో ఓ శిశువు సహా ముగ్గురు మృతిచెందగా, పలు మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ ప్రధాన పరిపాలనా భవనం పై రష్యా డ్రోన్ల ప్రయోగం కొంత భాగాన్ని ధ్వంసం చేసింది, పన్నెండుకు పైగా నివాస భవనాలపై దాడులు జరగడంతో పెద్ద మంటలు చెలరేగాయని సైనిక పరిపాలన అధిపతి తైమూర్ ట్కాచెంకో తెలిపారు.