Australia: విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితులు విధించనున్న ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా వలసలను నియంత్రించడానికి కొత్త చర్యలను తీసుకుంటోంది. అందులో భాగంగా, విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితులు విధించనుంది. 2025 నాటికి, ఈ సంఖ్యను 2,70,000 వరకు పరిమితం చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం పై విశ్వవిద్యాలయాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.ఇది విద్యావ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నాయి. ఆస్ట్రేలియా విద్యాశాఖ మంత్రి జాసన్ క్లేర్ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రభుత్వము 1,45,000 మంది విదేశీ విద్యార్థులను విశ్వవిద్యాలయాలలో, 95,000 మందిని స్కిల్ ట్రైనింగ్ సెక్టార్‌లో అనుమతించనుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఆరు లక్షల విద్యార్థి వీసాలు మంజూరయ్యాయని, ఇది గత సంవత్సరాలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ అనేది గమనించదగిన విషయం.