LOADING...
Shehbaz Sharif: డొనాల్డ్ ట్రంప్‌ పొగిడిన పాకిస్థాన్ ప్రధానమంత్రి.. అంతలోనే అందరి ముందు పరువు తీసుకున్న పాక్..
అంతలోనే అందరి ముందు పరువు తీసుకున్న పాక్..

Shehbaz Sharif: డొనాల్డ్ ట్రంప్‌ పొగిడిన పాకిస్థాన్ ప్రధానమంత్రి.. అంతలోనే అందరి ముందు పరువు తీసుకున్న పాక్..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2025
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈజిప్ట్‌లో జరిగిన గాజా శాంతి సదస్సు సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. అయితే ఆ పొగడ్తలు చేసిన కొద్ది సేపటికే పరిస్థితి అసహజంగా మారింది. ప్రపంచ నేతల సమక్షంలో ట్రంప్ షెహ్‌బాజ్‌ను షరీఫ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, "భారతదేశం, పాకిస్థాన్ ఇప్పుడు బాగానే కలసిపోతున్నాయ్ కదా?" అని ప్రశ్నించడంతో అక్కడి వాతావరణం కొద్దిసేపు అసౌకర్యంగా మారింది. సదస్సు వేదికపై షరీఫ్ పక్కనే నిలబడి ట్రంప్ మాట్లాడుతూ, "ఇక్కడ పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ ఉన్నారు. నా ప్రియమైన ఫీల్డ్ మార్షల్ ఇక్కడ లేరు కానీ,మీరు ఆయనకు నా శుభాకాంక్షలు చెబుతారు కదా?" అని అన్నారు.

వివరాలు 

రీఫ్ పరిస్థితి మరింత చికాకుగా..

ఈ వ్యాఖ్య విని షరీఫ్ ముఖంపై అసౌకర్యం స్పష్టంగా కనిపించింది. ట్రంప్ ఉద్దేశించిన "ఫీల్డ్ మార్షల్" అంటే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ అని అర్థమవడంతో, షరీఫ్ పరిస్థితి మరింత చికాకుగా మారింది. అదే సందర్భంలో ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ "మోదీ నా మంచి మిత్రుడు, అద్భుతమైన నాయకుడు" అని పేర్కొన్నారు. వెంటనే షెహ్‌బాజ్ వైపు తిరిగి, "ఇండియా, పాకిస్థాన్ ఇప్పుడు స్నేహంగా జీవిస్తాయనుకుంటున్నా, కదా?" అని అడిగారు. ఈ ప్రశ్నకు షరీఫ్ తడబడిన చిరునవ్వుతో తప్ప మరే సమాధానమూ ఇవ్వలేకపోయారు.

వివరాలు 

సోషల్ మీడియాలో వైరల్ అయిన జార్జియా మెలోనీ హావభావాలు 

ఈ సదస్సులో షెహ్‌బాజ్ షరీఫ్, ట్రంప్ నాయకత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తుతూ, ఆయనను మరోసారి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇండియా-పాకిస్థాన్ మధ్య గత మే నెలలో జరిగిన నాలుగు రోజుల ఘర్షణ సమయంలో ట్రంప్ మధ్యవర్తిత్వం చేశారని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ప్రసంగం జరుగుతుండగా, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ చూపిన హావభావాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై భారత మాజీ విదేశాంగ కార్యదర్శి, జేఎన్‌యూ చాన్స్‌లర్ కన్వల్ సిబల్ ఎక్స్ (Twitter/X) లో స్పందిస్తూ, "ఇలాంటి హాస్యాస్పద వేదికలో ప్రధాని మోదీ పాల్గొనకపోవడం సరైన నిర్ణయం" అని అన్నారు.

వివరాలు 

ట్రంప్ కళ్లలో నిజమైన నాయకుడు మునీరే

అలాగే, "షెహ్‌బాజ్ షరీఫ్ తన బాధ్యతా స్థాయిని మరిచి, ట్రంప్‌ను పొగడడంలో అతిగా ప్రవర్తించారు" అని విమర్శించారు. ట్రంప్ వ్యాఖ్యల్లో షరీఫ్‌ను పరోక్షంగా అవమానించి, పాకిస్థాన్ సైనికాధ్యక్షుడు మునీర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై నెటిజన్లు కూడా విభిన్నంగా స్పందించారు. "ట్రంప్ కళ్లలో నిజమైన నాయకుడు మునీరే" అని కొందరు కామెంట్లు చేశారు. మరికొందరు వ్యంగ్యంగా, "షెహ్‌బాజ్‌కు కాస్త చల్లని నీళ్లు ఇవ్వండి" అని రాశారు. ఇక మరోవైపు, గాజా నుంచి చివరి ఇజ్రాయెలీ బందీలను విడుదల చేసిన అనంతరం, రెండు సంవత్సరాలుగా సాగుతున్న యుద్ధం ముగిసిందని ట్రంప్ ప్రకటించారు.

వివరాలు 

రెడ్ క్రాస్ సహకారంతో విజయవంతంగా తిరిగి స్వదేశానికి

ఆ తరువాత ఈజిప్ట్‌లో ముస్లిం, యూరోపియన్ దేశాల నేతలతో సమావేశమై గాజా భవిష్యత్తు, ప్రాంతీయ శాంతి అవకాశాలపై చర్చలు జరిపారు. అయితే హమాస్, ఇజ్రాయెల్ ప్రతినిధులు ఈ చర్చలకు హాజరు కాలేదు. ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన ప్రకారం, రెడ్ క్రాస్ సహకారంతో గాజా ప్రాంతం నుంచి బందీలుగా ఉన్న 20 మందిని విజయవంతంగా తిరిగి తీసుకొచ్చారు. తెల్‌అవీవ్‌లోని "హోస్టేజ్ స్క్వేర్" వద్ద ఈ సందర్భంగా వేలాది మంది ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు.