NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Bad hijab'arrests: ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల జీవనం నరకం. హిజాబ్ లేదని లైంగిక హింస
    తదుపరి వార్తా కథనం
    Bad hijab'arrests: ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల జీవనం నరకం. హిజాబ్ లేదని లైంగిక హింస
    Bad hijab'arrests: ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల జీవనం నరకం. హిజాబ్ లేదని లైంగిక హింస

    Bad hijab'arrests: ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల జీవనం నరకం. హిజాబ్ లేదని లైంగిక హింస

    వ్రాసిన వారు Stalin
    Jun 25, 2024
    04:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల జీవనం నానాటికీ తీసికట్టు అవుతుంది.

    సరైన హిజాబ్ " ధరించలేదనే ఆరోపణలపై అరెస్టు తర్వాత టీనేజ్ బాలికలు , యువతులకు మామూలుగా వేధింపులు వుండటం లేదు.

    వారిపై లైంగిక హింస , దాడి సర్వ సాధారణమైపోయింది.

    ఆఫ్ఘన్ వార్తా సేవ, జాన్ టైమ్స్, ఈ ఆరోపణ సంఘటనలు కొన్ని సందర్భాల్లో వారిని ఆత్మహత్యకు ప్రేరేపించాయని తెలిపింది.

    తాలిబాన్ తీవ్రవాదులు ఆమెను అదుపులోకి తీసుకున్న తర్వాత ఒక మహిళ మృతదేహం కాలువలో కనుగొన్నారు.

    ఆమె మరణానికి ముందు లైంగిక వేధింపులకు గురైందని కుటుంబానికి సన్నిహిత వర్గాలు ఆరోపించాయి

    వివరాలు 

    నిర్బంధాలు

    'సరైన హిజాబ్ ' లేదనే సాకుతో తాలిబాన్లు చేస్తున్న నిర్బంధాలు UN దృష్టికి వచ్చాయని తెలిపింది.

    డిసెంబర్ 2023 , జనవరి 2024లో ఈ కారణాలతో అనేక మంది మహిళలను తాలిబాన్లు నిర్బంధించారని ఐక్యరాజ్యసమితి చెప్పింది.

    నిర్బంధంలో ఉన్నప్పుడు మహిళలు కొట్టడం , బెదిరింపుల పర్వం కొనసాగడంపై UN గతంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంస్ధ వారి చేదు అనుభవాలను వివరించడంతో మొత్తం ప్రపంచానికి తెలిసింది.

    వివరాలు 

    సాక్ష్యాలు

    బాధితులు తాలిబాన్ నిర్బంధ అనుభవాలను కొందరు పంచుకున్నారు.

    బాధితుల్లో 16 ఏళ్ల జహ్రాను 2023 డిసెంబర్‌లో పశ్చిమ కాబూల్‌లోని ఒక దుకాణంలో అరెస్టు చేశారు.

    తన కుమార్తెను విడుదల చేయడానికి ముందు రెండు వారాల పాటు నిర్బంధించారని జహ్రా తల్లి సోమాయా వెల్లడించారు.

    ఆమె ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, జహ్రా గాయపడినట్లు తెలిపారు.

    జనవరి 2024లో అరెస్టయిన 22 ఏళ్ల వైద్య విద్యార్థి అమీనా, తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ తాలిబాన్ జైలులో మూడు రాత్రులు గడిపిన అనుభవాన్ని పంచుకున్నారు.

    వివరాలు 

    విషాదాలు

    నిర్బంధంలో అనుభవించిన నరకం జహ్రా ఆత్మహత్యకు దారితీసింది. ఆమె తల్లి అర్ధరాత్రి ఉరివేసుకుని ఉన్నట్లు తెలిసింది.

    మరో కేసులో 2023 డిసెంబర్‌లో తాలిబాన్‌చే అరెస్టు చేసిన 23 ఏళ్ల యూనివర్శిటీ విద్యార్థిని మెరీనా సదత్ ఉంది.

    సదత్ మృతదేహం తరువాత కాలువలో కనుగొన్నారు. ఆమె మరణానికి ముందు ఆమె లైంగిక వేధింపులకు గురైందని కధనాలు సూచిస్తున్నాయి.

    ఈ సంఘటనలు ఆఫ్ఘన్ మహిళలపై ఈ నిర్బంధాలను తెలుపుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హిజాబ్

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    హిజాబ్

    Dress Code: బురఖాపై ఆంక్షలు విధించిన ముంబై కాలేజీ.. కొత్త డ్రెస్ కోడ్‌తో వివాదం ముంబై
    Hijab ban row: కర్ణాటకలో నేటి నుంచి హిజాబ్ ధరించొచ్చు.. సిద్ధరామయ్య ప్రభుత్వం ఉత్తర్వులు  కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025