Chinmoy Krishna Das: హిందూ సన్యాసి చిన్మోయ్ బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఛటోగ్రామ్ కోర్టు..
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించిన కారణంగా 2024 నవంబర్ 25వ తేదీన హిందూ ప్రచారకర్త, ఇస్కాన్ మాజీ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ జారీ చేసిన బెయిల్ పిటిషన్‌ను బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్ కోర్టు ఈరోజు (జనవరి 2) తిరస్కరించింది.
ఈ రోజు చిన్మోయ్ కృష్ణ బెయిల్ కోసం సుప్రీంకోర్టులోని న్యాయవాది అపూర్బా కుమార్ భట్టాచార్జీ నేతృత్వంలోని 11 మంది సభ్యుల బృందం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడ్వకేట్ మోఫిజుర్ హక్ భుయాన్ మధ్య వాదనలు జరిగాయి.
సుమారు 30 నిమిషాలు పాటు ఇరువురి వాదనలు వినిపించిన తర్వాత, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎండీ సైఫుల్ ఇస్లాం ఈ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు.
వివరాలు
త్వరలోనే బెయిల్ కోసం హైకోర్టులో అప్పీల్
ఈ సందర్భంగా హిందూ సన్యాసి తరపు న్యాయవాది అపూర్బా కుమార్ భట్టాచార్జీ మాట్లాడుతూ, "మేము ఐంజీబీ ఐక్య పరిషత్ బ్యానర్ ఆధ్వర్యంలో చటోగ్రామ్‌కు వచ్చాము.చిన్మయ్ కృష్ణ బెయిల్ కోసం కోర్టులో వాదనలు వినిపించాం.నేను ఇప్పటికే చిన్మోయ్ నుంచి వకలత్ తీసుకున్నాను" అని చెప్పారు.
అలాగే,ఆయన"సుప్రీం కోర్ట్, ఛటోగ్రామ్ బార్ అసోసియేషన్‌లలో సభ్యుడిగా ఈ కేసును తరలించడానికి స్థానిక న్యాయవాది అనుమతి అవసరం లేదని"పేర్కొన్నారు.
వారు త్వరలోనే బెయిల్ కోసం హైకోర్టులో అప్పీల్ చేయాలని ప్రణాళిక ప్రకటించారు.
2024 డిసెంబర్ 3వ తేదీన ప్రాసిక్యూషన్ టైమ్ పిటిషన్‌ను సమర్పించిన కారణంగా,హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణదాస్ తరపున న్యాయవాది లేకపోవడంతో బెయిల్ పిటిషన్ విచారణ 2024 జనవరి 2వ తేదీకి ఛటోగ్రామ్ కోర్టు వాయిదా వేసింది.