Page Loader
Bangladesh Durga Puja: బంగ్లాదేశ్ లో దుర్గాపూజ.. వేదికపై పెట్రోల్ బాంబులతో దాడులు 
బంగ్లాదేశ్ లో దుర్గాపూజ.. వేదికపై పెట్రోల్ బాంబులతో దాడులు

Bangladesh Durga Puja: బంగ్లాదేశ్ లో దుర్గాపూజ.. వేదికపై పెట్రోల్ బాంబులతో దాడులు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2024
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో హిందువులు ఘనంగా దుర్గా పూజలు జరుపుకుంటున్నారు. అయితే ఢాకాలోని తాటి బజార్ ప్రాంతంలో జరుగుతున్న దుర్గాపూజ మండపంపై కొంతమంది దుండగులు పెట్రోల్ బాంబులను విసిరారు. ఈ ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది. పెట్రో ల్ బాంబులు విసిరిన తర్వాత అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున్న తొక్కిసలాట జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను 'వాయిస్ ఆఫ్ బంగ్లాదేశ్ హిందూ' అనే సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.

Details

పోలీసులకు ఫిర్యాదు చేసిన హిందువులు

ఇటీవల బంగ్లాదేశ్‌లోని హిందువులపై జరుగుతున్న అవమానకర ఘటనలు ఎక్కువయ్యాయి. చిట్టగాంగ్‌లోని దుర్గాపూజ మండపంలోకి ప్రవేశించిన కొంతమంది, మరో మతానికి చెందిన పాటలు పాడారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, జేఎం సేన్ హాల్‌లో దుర్గాపూజ కమిటీ సభ్యులు, దుర్గా పాటలు పాడడానికి అనుమతించినప్పటికీ, అది వేరే వర్గానికి చెందిన పాటలు కావడంతో స్థానిక హిందువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనలు బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై ప్రశ్నలు తీసుకొస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తొక్కిసలాటలో గాయాలు