
Bangladesh: అదృశ్యమైన బాంగ్లాదేశ్ ఎంపీ.. కోలకత్తాలో హతం
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ కు చెందిన అధికార పార్టీ ఎంపీ అన్వరుల్ అజీమ్ కోల్‌కతాలో హత్యకు గురైనట్లు హోం మంత్రి అసదుజమాన్ ఖాన్ ఢాకాలో దృవీకరించారు.
ఈ ఘటనపై బంగ్లా దేశ్ ప్రధాని షేక్ హసీనా విచారం వ్యక్తం చేశారు.మరో వైపు భారత్ అధికారులు దర్యాప్తులో పూర్తిగా సహకరిస్తున్నారని హోం మంత్రి వివరించారు.
ఈ మేరకు పశ్చిమ బెంగాల్ పోలీసులు తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు.అన్వరుల్ అజీమ్ ..అవామీలీగ్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మే18 నుంచి కనిపించడం లేదని కోలకత్తా పోలీసు జనరల్ డైరీ చెపుతోంది. మే 12 న వైద్య చికిత్స కోసం అన్వరుల్ అజీమ్ కోలకత్తా వచ్చారు.
Details
అన్వరుల్ అజీమ్ ఓ ప్లాట్ లో హతమైనట్లు తెలిపిన పోలీసులు
దీనిపై కోలకత్తా బారానగర్ పోలీసు స్టేషన్ లో ప్రాధమిక ఫిర్యాదు నమోదైంది. స్ధానిక న్యూటౌన్ ఏరియాలో అజీమ్ ఎక్కువ సమయం గడిపినట్లు తెలుస్తోంది.
ఆయన అదే ప్రాంతంలో హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. మూడు సార్లు MP అయిన అన్వరుల్ అజీమ్ ఓ ప్లాట్ లో హతమైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ హత్యకు సంబంధించి ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్నారని అసదుజమాన్ ఖాన్ తెలిపారు.
ఇది పధకం ప్రకారం జరిగిందన్నారు. హత్యకు గల కారణాలు విచారణలో తేలుతాయని చెప్పారు.
Details
అన్వరుల్ అజీమ్ ఎందుకు కోలకత్తా వచ్చారు
తన చిరకాల మిత్రుడైన గోపాల్ బిశ్వాస్ కుటుంబ సభ్యులను మే 12 న సాయంత్రం 7 గంటలకు అజీమ్ కలుసుకున్నాడు.
ఆయన కాళీ గంజ్ ఉపజైలా అవామీ లీగ్ కు అధ్యక్షుడిగా ఉన్నారు. బిశ్వాస్ ఇంటినుంచి మే13 న డాక్టర్ ను కలవటానికి వెళ్లారు.
బిదాన్ పార్కు కు సమీపంలో కోలకత్తా పబ్లిక్ స్కూలు వద్ద టాక్సీలో ప్రయాణానికి సిద్ధం అయ్యారు.
ఢిల్లీ వెళ్లి సాయంత్రానికి మళ్లీ వస్తానని బిశ్వాస్ కు చెప్పి అన్వరుల్ అజీమ్ బయలు దేరారు .ఢిల్లీ చేరగానే కాల్ చేస్తానని బిశ్వాస్ తో అన్నారు.
తనకు కాల్ చేయవద్దని బిశ్వాస్ కు చెప్పారు.
Details
అన్వరుల్ అజీమ్ హత్య మిస్టరీ వీడేనా?
ఇదిలా ఉంటే మే15న గోపాల్ బిశ్వాస్ కు వేరే వాట్సాప్ నెంబర్ నుంచి అన్వరుల్ అజీమ్ పేరుతో మెసేజ్ వచ్చింది.
దాని సారాంశం ఏమిటంటే ఢిల్లీ చేరానని , కొందరు వి.ఐ.పిలతో ఉన్నానని ఉంది.బిశ్వాస్ తనకు కాల్ చేయవద్దని కూడా రాసి వుంది.
ఈ మెసేజ్ తన సహాయకుడు రౌఫ్ కు సైతం పంపినట్లు వుంది. కానీ మే17 న అన్వరుల్ అజీమ్ కుటుంబ సభ్యులు మాట్లాడటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించలేదు.
దీంతో గోపాల్ బిశ్వాస్ కు అజీమ్ కుటుంబ సభ్యులు కాల్ చేశారు.గోపాల్ తనకు తెలియదని చెప్పారు.
Details
ఢాకా పోలీసులకు ఫిర్యాదు
ఏదో జరిగి వుండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానించారు. దీంతో వారు ఢాకా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
న్యూటౌన్ ఏరియాలో అన్వరుల్ అజీమ్ హత్యోదంతంపై కేసు రిజిస్టర్ చేశారు. తదుపరి విచారణను బిదానగర్ కమీషనరేట్ నిర్వహించనుంది.
జూన్ 1న జరగబోేయే తుది దశ పోలింగ్ పై అన్వరుల్ అజీమ్ హత్యోదంతం ప్రభావం చూపుతుందో లేదో తెలియాల్సి ఉంది.