Page Loader
Bengal: 'హనీ ట్రాప్'లో బంగ్లాదేశ్ ఎంపీ,5 కోట్ల సుపారీ..భారత్‌కు వచ్చిన విదేశీ ఎంపీ హత్య మిస్టరీ!
Bengal: 'హనీ ట్రాప్'లో బంగ్లాదేశ్ ఎంపీ,5 కోట్ల సుపారీ

Bengal: 'హనీ ట్రాప్'లో బంగ్లాదేశ్ ఎంపీ,5 కోట్ల సుపారీ..భారత్‌కు వచ్చిన విదేశీ ఎంపీ హత్య మిస్టరీ!

వ్రాసిన వారు Sirish Praharaju
May 24, 2024
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్య కేసులో సీఐడీ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య వెనుక హనీ ట్రాప్ ఉన్నట్లు పశ్చిమ బెంగాల్ సీఐడీ అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఎంపీ హత్య వెనుక స్నేహితుడి హస్తం ఉందని గతంలో సీఐడీ పేర్కొంది. అనార్‌ను హత్య చేసేందుకు స్నేహితుడే రూ.5 కోట్ల విలువైన సుపారీ ఇచ్చాడని సీఐడీ ప్రాథమిక విచారణలో తేలింది. మరోవైపు గురువారం సాయంత్రం పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు.

Details 

కిరాయి నేరస్థులు హత్య

ఎంపీని ఓ మహిళ న్యూ టౌన్‌లోని ఫ్లాట్‌కు రప్పించిందని, ఆ తర్వాత కిరాయి నేరస్థులు హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అదే సమయంలో, అదుపులోకి తీసుకున్న వ్యక్తి హత్యలో ప్రధాన నిందితులలో ఒకరిని కలిశాడు. ఈ వ్యక్తి బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న పశ్చిమ బెంగాల్ ప్రాంతం నివాసి. అదుపులోకి తీసుకున్న వ్యక్తి గుర్తింపును వెల్లడించకుండా, ఆ వ్యక్తి ఎంపిని ఎందుకు కలిశాడు, వారు ఏమి చర్చించారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు.

Details 

ఎక్సైజ్ శాఖ ఉద్యోగి, ఫ్లాట్ యజమాని

సీనియర్ పోలీసు అధికారి ప్రకారం,బంగ్లాదేశ్ ఎంపీ వచ్చిన కోల్‌కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలో ప్లాట్‌ను దాని యజమాని అతని స్నేహితుడికి అద్దెకు ఇచ్చాడు.ఈ ఫ్లాట్ యజమాని ఎక్సైజ్ శాఖ ఉద్యోగి. హత్యకు అవామీ లీగ్ ఎంపీ అనార్ స్నేహితుడు రూ.5కోట్ల సుపారీ ఇచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,బంగ్లాదేశ్‌ ఎంపీ స్నేహితుడికి కూడా సన్నిహితంగా ఉండే ఓమహిళ హనీ ట్రాప్‌లో ఎంపీ పడినట్లు దర్యాప్తులో తేలింది. తన న్యూ టౌన్ ఫ్లాట్‌కు వెళ్లాలని ఎంపీని ఆమహిళ ప్రలోభపెట్టినట్లు తెలుస్తోంది.అక్కడికి చేరుకోగానే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. మే13 నుంచి కోల్‌కతా నుంచి అదృశ్యమైన ఎంపీ హత్యకు గురయ్యారని,ముగ్గురిని అరెస్టు చేశామని బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజమాన్ ఖాన్ తెలిపారు.