NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Chinmoy Krishna Das: చిన్మోయ్ దాస్,అయన అనుచరులపై బంగ్లాదేశ్‌లో మరో కేసు నమోదు
    తదుపరి వార్తా కథనం
    Chinmoy Krishna Das: చిన్మోయ్ దాస్,అయన అనుచరులపై బంగ్లాదేశ్‌లో మరో కేసు నమోదు
    చిన్మోయ్ దాస్,అయన అనుచరులపై బంగ్లాదేశ్‌లో మరో కేసు నమోదు

    Chinmoy Krishna Das: చిన్మోయ్ దాస్,అయన అనుచరులపై బంగ్లాదేశ్‌లో మరో కేసు నమోదు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 09, 2024
    09:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇస్కాన్‌ ప్రచారకర్త,ప్రముఖ హిందూ నాయకుడు చిన్మయ్‌ కృష్ణదాస్‌పై బంగ్లాదేశ్‌లో మరో కేసు నమోదైంది.

    కృష్ణదాస్‌తో పాటు వందలాది మంది అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

    ఇప్పటికే దేశద్రోహం ఆరోపణలపై ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

    తాజాగా,హెఫాజాత్-ఎ-ఇస్లాం కార్యకర్త ఇనాముల్ హక్ ఫిర్యాదు మేరకు ఈ కొత్త కేసు నమోదైంది.

    బంగ్లా మీడియా వర్గాల సమాచారం ప్రకారం,గత నెల 26న చిట్టగాంగ్‌ కోర్టు ప్రాంగణంలో సంప్రదాయ దుస్తులు ధరించిన కృష్ణదాస్‌,అతని అనుచరులు తనపై దాడి చేశారని ఇనాముల్‌ హక్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.

    ఈదాడిలో తన కుడి చేయి విరిగిందని,తలకు తీవ్రమైన గాయాలయ్యాయని హక్‌ తెలిపారు.

    గాయాల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన,డిశ్చార్జ్‌ అయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

    వివరాలు 

    అరెస్టుకు నిరసనగా వేలాది మంది హిందువులు ఆందోళన

    కృష్ణదాస్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొనడంతో పాటు, 164 మంది గుర్తింపు పొందిన వ్యక్తులు, మరో 500 మంది గుర్తుతెలియని వ్యక్తులు నిందితులుగా ఉన్నారని తెలిపారు.

    దేశద్రోహం ఆరోపణలపై చిన్మయ్‌ కృష్ణదాస్‌ను గత నెల 26న బంగ్లాదేశ్‌ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.

    ఈ అరెస్టుకు నిరసనగా వేలాది మంది హిందువులు ఆందోళన చేపట్టారు.నిరసనల సమయంలో పోలీసులు కాల్పులు జరపడం ఉద్రిక్తతలకు దారితీసింది.

    హిందూ సమాజ నాయకుడైన బ్రహ్మచారిని హజ్రత్‌ విమానాశ్రయ సమీపంలో అరెస్టు చేసి, చిట్టగాంగ్‌కు తరలించారు.

    అక్టోబర్‌ 25న జరిగిన ఒక ర్యాలీ సందర్భంగా జాతీయ జెండాను అవమానపరిచారనే ఆరోపణలపై బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ నేత ఖలీదా జియా ఫిర్యాదు మేరకు ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బంగ్లాదేశ్

    తాజా

    Trump: ట్రంప్‌ హత్య కు బెదిరింపులు.. ఎఫ్‌బిఐ మాజీ డైరెక్టర్‌పై చర్యలు డొనాల్డ్ ట్రంప్
    Motivation: ప్రతి తాళానికి తాళంచెవి ఉంటుంది.. అలాగే ప్రతి సమస్యకూ పరిష్కారమూ ఉంటుంది! జీవనశైలి
    Turkey: తుర్కియే అధ్యక్షుడి కుమార్తె మాకు బాస్ కాదు.. సెలెబీ సంచలన ప్రకటన పాకిస్థాన్
    Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్

    బంగ్లాదేశ్

    Nahid Rana: భారత్‌తో సిరీస్‌కు సిద్ధం.. బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ నహిద్ రాణా  క్రికెట్
    Khaleda Zia: ఆసుపత్రిలో చేరిన బాంగ్లాదేశ్ మాజీ ప్రధాని.. 2021లో లివర్ సిర్రోసిస్‌గా నిర్ధారణ  అంతర్జాతీయం
    Bangladesh: భార‌త్‌తో టెస్టు సిరీస్‌..జ‌ట్టును ప్ర‌క‌టించిన బంగ్లాదేశ్‌ క్రీడలు
    Ind Vs Ban: విజృంభించిన భార‌త బౌల‌ర్లు.. బంగ్లాదేశ్ 149 ఆలౌట్‌.. క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025