
Train Accident: బంగ్లాదేశ్‌లో రైలు ప్రమాదం.. 13 మంది మృతి, పలువురికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో కనీసం 13 మంది మరణించాగా, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
ఈ రోజు సాయంత్రం 4:15 గంటల ప్రాంతంలో కిషోర్‌గంజ్ నుంచి ఢాకాకు వెళ్తున్న ప్యాసింజర్ రైలు సరుకు రవాణా రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఇప్పటివరకు 13 మృతదేహాలు లభ్యమయ్యాయని భైరబ్ రైల్వే స్టేషన్‌లోని పోలీసు అధికారిని ఉటంకిస్తూ bdnews24 నివేదించింది.
దెబ్బతిన్న కోచ్‌ల కింద చాలా మంది చిక్కుకున్నారని న్యూస్ పోర్టల్ తెలిపింది.
ప్రాథమిక నివేదిక ప్రకారం, రవాణా రైలు వెనుక నుండి ఎగరో సింధూర్‌పైకి దూసుకెళ్లింది, రెండు క్యారేజీలను ఢీకొట్టిందని ఢాకా రైల్వే పోలీసు సూపరింటెండెంట్ అనోవర్ హొస్సేన్ చెప్పారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్యాసింజర్ రైలును ఢీకొన్న రవాణా రైలు
Bangladesh Train Accident: 14 Killed, Several Injured After Passenger Train Collides With Freight Train in South Asian Country#trainaccident #Bangladesh pic.twitter.com/rUzzmr3W5q
— Amit Chaubey (@meamitchaubey) October 23, 2023