Page Loader
Barak Magen: ఇజ్రాయెల్‌ మరో అధునాతన రక్షణ వ్యవస్థ 'లైట్నింగ్‌ షీల్డ్‌'.. అసలేంటీ మెరుపు కవచం? ఇది ఎలా పని చేస్తుంది?
ఇజ్రాయెల్‌ మరో అధునాతన రక్షణ వ్యవస్థ 'లైట్నింగ్‌ షీల్డ్‌'.. అసలేంటీ మెరుపు కవచం? ఇది ఎలా పని చేస్తుంది?

Barak Magen: ఇజ్రాయెల్‌ మరో అధునాతన రక్షణ వ్యవస్థ 'లైట్నింగ్‌ షీల్డ్‌'.. అసలేంటీ మెరుపు కవచం? ఇది ఎలా పని చేస్తుంది?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2025
09:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌,ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరస్పర దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా ప్రాంతం సంక్షోభంలోకి చేరుతోంది. గతంలో హమాస్‌,హెజ్‌బొల్లా గ్రూపుల దాడులను సమర్థంగా తిప్పికొట్టిన ఇజ్రాయెల్‌ సుప్రసిద్ధ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్‌ ఇప్పుడు ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణుల ఎదుట బలహీనపడింది. ఇరాన్‌ దాడులతో ఇజ్రాయెల్‌లోని కీలక ప్రాంతాలు తీవ్రంగా నాశనం అయ్యాయి. ఈ నేపథ్యంలో, ఇజ్రాయెల్‌ తాజాగా మరో అత్యాధునిక రక్షణ వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీనిపేరు 'మెరుపు కవచం' లేదా 'లైట్నింగ్‌ షీల్డ్‌'. ఈ కవచం విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

వివరాలు 

ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థకు ఇరాన్‌ తూట్లు

ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థ గతంలో ఉగ్రవాదుల రాకెట్లను గాల్లోనే తునాతునకలుగా చేయగలదని నిరూపించింది. కానీ తాజా పరిణామాలు మాత్రం ఈ వ్యవస్థ బలహీన పడుతోందని స్పష్టం చేశాయి. టెల్ అవీవ్‌లోని ప్రముఖ గూఢచార సంస్థ మొస్సాద్‌, మిలటరీ ఇంటెలిజెన్స్ కేంద్రాలను లక్ష్యంగా ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణులను ఐరన్ డోమ్‌ అడ్డుకోలేకపోయింది. ఈ కారణంగా, 'బరాక్‌ మెగెన్‌' అని పిలవబడే నూతన రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్‌ రంగంలోకి దించింది. ఈ వ్యవస్థను మధ్యదరా సముద్ర తీర ప్రాంతంలోని జలాల్లో మోహరించారు.

వివరాలు 

'మెరుపు కవచం' అంటే ఏంటి? 

హీబ్రూ భాషలో 'లైట్నింగ్‌ షీల్డ్‌'గా అర్థమయ్యే 'బరాక్‌ మెగెన్‌' గగనతల రక్షణ వ్యవస్థగా ప్రసిద్ధి చెందుతోంది. ఇది ప్రత్యేకించి నేవల్‌ రక్షణ కోసం అభివృద్ధి చేశారు. ఇది బరాక్‌ MX క్షిపణి రక్షణ వ్యవస్థ ఆధారంగా రూపొందించబడిన అప్డేటెడ్‌ వర్షన్‌. డ్రోన్లు, క్రూయిజ్‌ మిసైళ్లు, బాలిస్టిక్‌ క్షిపణుల వంటి పలు ప్రమాదకర దాడుల నుంచి తమ యుద్ధ నౌకలను రక్షించేందుకు ఇజ్రాయెల్‌ దీనిని అభివృద్ధి చేసింది. అత్యాధునిక సార్-6 యుద్ధ నౌకల్లో ఇది ఇప్పటికే వినియోగంలో ఉంది. ఈ టెక్నాలజీని ఇజ్రాయెల్ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ (IAI) అభివృద్ధి చేసింది.

వివరాలు 

ఎలా పనిచేస్తుంది? 

'బరాక్‌ మెగెన్‌' వ్యవస్థను రాడార్‌, కమాండ్‌ కంట్రోల్‌ యూనిట్‌ల ఆధారంగా నడుపుతారు. శత్రు క్షిపణులును ముందుగానే గుర్తించి,వెంటనే ప్రతిదాడికి దిగుతుంది. దీనిలో స్మార్ట్ వర్టికల్‌ లాంచర్‌ వ్యవస్థ అమర్చబడి ఉంటుంది. ఇది ఒక్కసారిగా వివిధ రకాల క్షిపణులను ప్రయోగించగలదు. చిన్న శ్రేణి నుంచి సుదూర లక్ష్యాల వరకు ఈ వ్యవస్థ సమర్థంగా ఛేదించగలదు. నౌక ఉపరితలానికి అనుగుణంగా దీనిని డిజైన్‌ చేశారు. శత్రు క్షిపణులు ఏ దిశ నుంచి వచ్చినా, ఏ కోణంలో వచ్చినా, ఇవి ఛేదించగలగడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. 360 డిగ్రీల పరిధిలో పని చేస్తూ, ఒకేసారి పలు లక్ష్యాలపై దాడి చేయగల సామర్థ్యం దీనికి ఉంది. అదేవిధంగా, ఒక్క లాంచర్‌ నుంచే అన్ని రకాల క్షిపణుల ప్రయోగం వీలవుతుంది.

వివరాలు 

తొలిపరీక్ష 2022లో 

'బరాక్‌ మెగెన్‌' మొదటి పరీక్ష 2022 నవంబర్లో జరిగింది. సార్-6 తరహా యుద్ధ నౌక అయిన INS మెగెన్‌ నుంచి దీన్ని ప్రయోగించారు. అప్పట్లో దీని విజయవంతమైన ప్రయోగానికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్‌ అధికారికంగా విడుదల చేసింది. లక్ష్యాలను ఎంతో ఖచ్చితంగా ఛేదించగలగినట్లు వారు ప్రకటించారు.

వివరాలు 

భారత్‌ సహకారంతో బరాక్‌-8 

ఇజ్రాయెల్‌ 'బరాక్‌ మెగెన్‌'తో పాటు 'బరాక్‌-8' అనే మరో శక్తివంతమైన రక్షణ వ్యవస్థను కూడా అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్టులో భారత్‌ భాగస్వామిగా ఉన్నది. ఇజ్రాయెల్‌తో కలిసి భారత ప్రభుత్వం డీఆర్‌డీవో (DRDO) సహకారంతో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ భూమి మీద నుంచి గగనంలోకి ప్రయోగించేందుకు అనువుగా ఉంటుంది. డ్రోన్లు, యాంటీ షిప్‌ మిసైళ్లతో పాటు బాలిస్టిక్‌ క్షిపణులను అడ్డుకునే సామర్థ్యం దీనికి ఉంది. ఇది గరిష్టంగా 100 కి.మీ దూరంలోని లక్ష్యాలను, 20 కి.మీ ఎత్తులో ఉన్నా ఛేదించగలదు. ఈ వ్యవస్థను యుద్ధ నౌకలతో పాటు భూపరిపాలన రక్షణ వ్యవస్థల్లో కూడా వినియోగిస్తున్నారు.