Page Loader
Israel-Hamas War: గాజా ఆస్పత్రిపై దాడికి ముందు.. ఆ తర్వాత.. వీడియోను విడుదల చేసిన ఇజ్రాయెల్
గాజా ఆస్పత్రిపై దాడికి ముందు.. ఆ తర్వాత.. వీడియోను విడుదల చేసిన ఇజ్రాయెల్

Israel-Hamas War: గాజా ఆస్పత్రిపై దాడికి ముందు.. ఆ తర్వాత.. వీడియోను విడుదల చేసిన ఇజ్రాయెల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 18, 2023
05:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్-హమాస్ మిలిమెంట్ల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. మంగళవారం సెంట్రల్ గాజాలోని ఓ ఆస్పత్రిపై జరిగిన దాడిలో 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆస్పత్రిపై ఇజ్రాయెల్ సైన్యమే వైమానికి దాడికి పాల్పడిందంటూ హమాస్ ఆరోపిస్తుండగా, ఇస్లామిక్ జిహాద్ రాకెట్ మిస్ ఫైర్ అయి ఆస్పత్రిపై పడటంతో ఈ దారుణం చోటు చేసుకుందంటూ ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అయితే ప్రమాదానికి ముందు ఆస్పత్రి ఆవరణకు సంబంధించిన వీడియోను తాజాగా ఐడీఎఫ్ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాద సంస్థ విఫలమైన రాకెట్ ప్రయోగం గాజా నగరంలోకి అల్ అహ్లీ ఆస్పత్రిని తాకింది. దాడికి ముందు ఆ తరువాత చుట్టుపక్కల ప్రాంతమని ఐడీఎఫ్ పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వీడియోను పోస్టు చేసిన ఇజ్రాయెల్