ఐదుగురు పిల్లలను చంపిన తల్లికి కారుణ్య మరణం; 16 ఏళ్ల తర్వాత ఘటన
జెనీవీవ్ లెర్మిట్ అనే మహిళ ఫిబ్రవరి 28, 2007న తన ఐదుగురు కన్న బిడ్డలను హత్య చేసిన ఘటన అప్పట్లో బెల్జియంలో సంచలనం రేపింది. దాదాపు 16ఏళ్ల ఆ మహిళ అనాయాసంగా(కారుణ్య) మరణించారని ఆమె తరఫు న్యాయవాది గురువారం వెల్లడించారు. నివెల్లెస్ పట్టణంలోని తమ ఇంట్లో తండ్రి లేని సమయంలో కుమారుడు, నలుగురు కుమార్తెల గొంతులు కోసి జెనీవీవ్ హత్య చేసారు. ఆ తర్వాత ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది, కానీ ప్రయత్నం విఫలమైంది. ఈ కేసులో కోర్టు జెనీవీవ్ లెర్మిట్‌కి 2008లో జీవిత ఖైదు విధించింది. 2019లో ఆరోగ్యం బాగాలేకపోవడంతో మానసిక ఆసుపత్రికి తరలించారు.
బెల్జియంలో భరించలేని మానసిక సమస్యతో బాధపడుతున్నట్లయితే 'అనాయాస' పద్ధతిని ఆశ్రయించొచ్చు
జెనీవీవ్ లెర్మిట్ తీవ్రమైన మానసిక కుంగుబాటుకు గురైనట్లు, అందుకే మరణించడానికి అనాయాస(కారణ్య) పద్ధతిని ఎంచుకున్నట్లు న్యాయవాది నికోలస్ కోహెన్ చెప్పారు. భరించలేని మానసిక సమస్యతో బాధపడుతున్నారని భావించినట్లయితే చనిపోవడానికి అనాయాసంగా మార్గాన్ని ఆశ్రయించవచ్చని బెల్జియన్ చట్టం చెబుతోంది. నయం కాని వ్యాధుల విషయంలోనే ఇది వర్తిస్తుంది. పిల్లలను హత్య చేసినప్పటి నుంచి ఆమె తన జీవితంపై ఆశగా లేదని న్యాయవాది చెప్పారు. హత్యలు చేసిన రోజే ఆమె ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు పేర్కొన్నారు. బెల్జియంలో గత సంవత్సరం 2,966 మంది అనాయాస(కారుణ్య) పద్ధతి ద్వారా మరణించారు. ఇది 2021తో పోలిస్తే 10 శాతం ఎక్కువ అని అధికారులు తెలిపారు.