LOADING...
Pakistan-Afghan War: పాక్‌కు నమ్మకం ద్రోహం చేయడం కొత్తేమీ కాదు
పాక్‌కు నమ్మకం ద్రోహం చేయడం కొత్తేమీ కాదు

Pakistan-Afghan War: పాక్‌కు నమ్మకం ద్రోహం చేయడం కొత్తేమీ కాదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 18, 2025
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌కు నమ్మక ద్రోహం చేయడం అలవాటు అని చెప్పేలా, తాజా ఘటన ఆఫ్ఘనిస్థాన్‌పై దాడులతో మళ్లీ నిరూపితమైంది. గతంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఘర్షణలు జరిగాక, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, పాక్ దాన్ని ఉల్లంఘించి దాడులు జరిపింది. భారత్ ఆ దాడులను తట్టుకోలేక, ఇతర దేశాల సహాయానికి మొరపెట్టినప్పటికీ, ఒప్పందం అమలు అయిన వెంటనే పాక్ దాన్ని ఉల్లంఘించి మరింత దాడులు చేసింది. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌పై కూడా అదే వైఖరిని అవలంబించింది. 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన గంటల్లోనే పాక్ ఆ ఫ్లేచర్‌ను ఉల్లంఘించి, వైమానిక దాడులు జరిపి ముగ్గురు క్రికెటర్లను మరణానికి గురిచేసింది. దీని వలన తాలిబాన్ సైన్యం ఆగ్రహానికి గురవుతోంది. పాక్ ఉల్లంఘణను ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.

Details

ఇటీవల కాబుల్ పై దాడులు

వాస్తవానికి, పాక్ ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వడం అలవాటే. ఇటీవల, ఆఫ్ఘన్ రాజధాని కాబుల్‌పై దాడులు జరిపింది. దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్థాన్ స్పందించింది. సరిహద్దుల వద్ద పాక్ కాల్పులు జరిపితే, ఆఫ్ఘన్ సైన్యం పలువురు పాక్ సైనికులను మట్టుబెట్టింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశం లేకపోవడంతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. వెంటనే, మధ్యవర్తిత్వం కోసం ఖతార్, సౌదీ అరేబియా అక్టోబర్ 15న పాక్‌తో టెలిఫోన్ ద్వారా సంప్రదించారు. దీంతో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినా, పాక్ దాడులను కొనసాగించడం ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

Details

పాక్టికా ప్రావిన్స్‌లో వైమానిక దాడులు

పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం, రెండు దేశాలు 48 గంటల కాల్పుల విరమణను పొడిగించేందుకు అంగీకరించాయి. అయినా పాక్ మళ్లీ దాడికి దిగింది. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ, ఆఫ్ఘనిస్థాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌లో వైమానిక దాడులు జరిపింది. డ్యూరాండ్ లైన్‌కు సరిహద్దుగా ఉన్న పాక్టికా ప్రావిన్స్‌లోని అనేక జిల్లాల్లో పాక్ వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు కబీర్, సిబ్గతుల్లా, హరూన్ మృతి చెందగా, మరో ఎనిమిది మంది మరణించడంతో ఏడుగురు గాయపడ్డారు.

Details

ఉర్గున్ జిల్లాలో ఘటన

నివేదికల ప్రకారం, ఈ ఆటగాళ్లు పాక్టికా రాజధాని షరానాలో స్నేహపూర్వక మ్యాచ్ ఆడటానికి వెళ్తుండగా, ఉర్గున్ జిల్లాలో ఒక సమావేశానికి హాజరైన అనంతరం దాడి జరిగినది. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ఈ ఘటనను క్రీడా, క్రికెట్‌కి గణనీయమైన నష్టంగా భావించింది. అమరవీరుల కుటుంబాలకు మరియు పాక్టికా ప్రజలకు బోర్డు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ విషాద ఘటన కారణంగా, నవంబర్ చివరలో పాకిస్థాన్‌తో జరగనున్న T20 సిరీస్ నుంచి ఆఫ్ఘనిస్థాన్ జట్టు వైదొలుగుతోంది. బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.