Page Loader
Gaza: గాజాకి మానవతా సహాయంపై బైడెన్ కీలక నిర్ణయం 
Gaza: గాజాకి మానవతా సహాయంపై బైడెన్ కీలక నిర్ణయం

Gaza: గాజాకి మానవతా సహాయంపై బైడెన్ కీలక నిర్ణయం 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 02, 2024
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర గాజాలో సహాయం చేస్తున్న సమయంలో జరిగిన తోపులాటలో కనీసం 115 మంది పాలస్తీనియన్లు మరణించగా మరో 750 మందికి గాయాలయ్యాయి. దింతో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గాజాకు మానవతా సహాయం ప్రారంభించనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. సహాయంతో భాగంగా ముందు ఆహార పదార్థాలు అందించే అవకాశం ఉందని సమాచారం. జోర్డాన్, ఫ్రాన్స్‌తో సహా ఇతర దేశాలు ఇప్పటికే గాజాలో సహాయక చర్యలను చేపట్టాయి. గాజాలోకి పెద్ద మొత్తంలో సహాయాన్ని అందించడానికి సముద్ర కారిడార్‌ను కూడా యుఎస్ పరిశీలిస్తోందని బైడెన్ విలేకరులతో అన్నారు.

Details 

ఎయిర్‌డ్రాప్‌లు సహాయపడతాయని అమెరికా నమ్మకం 

గాజాలో నెలకొన్న భయంకర పరిస్థితులను పరిష్కరించేందుకు ఎయిర్‌డ్రాప్‌లు సహాయపడతాయని అమెరికా నమ్ముతోంది. కానీ, అవి ట్రక్కులకు ప్రత్యామ్నాయం కాదు. ఎయిర్ డ్రాప్ ల కంటే ట్రక్కుల ద్వారానే సహాయాన్ని త్వరగా చేసే అవకాశం ఉంది. అమెరికా, మిత్రదేశాలు హమాస్-ఇజ్రాయెల్ మధ్య కొత్త తాత్కాలిక కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించింది. గాజాలోని మిలిటెంట్ గ్రూప్ చేతిలో ఉన్న బందీలను విడుదల చేయడం, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడిపించడం వంటి అంశాలపై జరిగిన ఒప్పందం ఆరు వారాల వరకు అమలులో ఉంటాయి.