Loading...
Israel: ఇజ్రాయెల్ ప్రధాని రేసులో గడి ఐసెన్‌కోట్.. అరబ్ పార్టీల మద్దతు
ఇజ్రాయెల్ ప్రధాని రేసులో గడి ఐసెన్‌కోట్.. అరబ్ పార్టీల మద్దతు

Israel: ఇజ్రాయెల్ ప్రధాని రేసులో గడి ఐసెన్‌కోట్.. అరబ్ పార్టీల మద్దతు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2026
08:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు మరోసారి అధికారం దక్కడం కష్టంగా కనిపిస్తోంది. ఆయన నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు తగ్గుతున్నాయి. మాజీ మిలిటరీ చీఫ్ గడి ఐసెన్‌కోట్‌కు ఇజ్రాయెల్‌లోని అతిపెద్ద అరబ్ రాజకీయ కూటమి జాయింట్ లిస్ట్, రామ్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో తదుపరి ప్రధానిగా ఐసెన్‌కోట్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు పెరిగాయి. మరోవైపు, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానించాలనే అంశంపై అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ వరుసగా రెండో రోజు రాజకీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. నెతన్యాహు, ఐసెన్‌కోట్ ఇద్దరిలో ఎవరూ స్పష్టమైన మెజారిటీ సాధించలేదు.

వివరాలు 

కింగ్‌మేకర్లుగా మారిన అరబ్ పార్టీలు

ప్రభుత్వ ఏర్పాటుకు ఒక నేతను ఆహ్వానించే అధికారం అధ్యక్షుడికి ఉన్నప్పటికీ.. సంప్రదాయం ప్రకారం పార్లమెంట్‌లో అత్యధిక మంది సభ్యుల మద్దతు ఉన్న నాయకుడికి అవకాశం కల్పిస్తారు.

గత నెల 27న జరిగిన ఇజ్రాయెల్ ఎన్నికల్లో అరబ్ రాజకీయ కూటములు మొత్తం 19 స్థానాలను గెలుచుకున్నాయి.

దీంతో తదుపరి ప్రభుత్వ ఏర్పాటులో వాటి మద్దతు కీలకంగా మారింది. ఈ పార్టీలను ఇప్పుడు కింగ్‌మేకర్లుగా పరిగణిస్తున్నారు.

ఐసెన్‌కోట్‌కు మద్దతు ప్రకటించినప్పటికీ.. ఆయన నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో అరబ్ పార్టీలు భాగస్వాములవుతాయా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

వివరాలు 

రామ్ పార్టీ కూడా ఐసెన్‌కోట్‌కు మద్దతు

ప్రభుత్వ ఏర్పాటుకు ఐసెన్‌కోట్‌కు అవకాశం కల్పించాలని అధ్యక్షుడు హెర్జోగ్‌కు సిఫారసు చేయనున్నట్లు 11 స్థానాలు గెలుచుకున్న జాయింట్ లిస్ట్ ప్రకటించింది.

తమ కూటమిలోని మూడు వర్గాలు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నాయని వెల్లడించింది.

నెతన్యాహు మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టకుండా చూడాలన్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

మరోవైపు, ఎనిమిది స్థానాలు సాధించిన రామ్ పార్టీ కూడా ఐసెన్‌కోట్‌కు మద్దతు తెలిపింది.

ఈ రెండు పార్టీల మద్దతుతో ఆయనకు మొత్తం 67 మంది ఎంపీల బలం ఉన్నట్లు అయింది.

120 మంది సభ్యులున్న ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ కంటే ఇది ఎక్కువ కావడం విశేషం.

ADVERTISEMENT

వివరాలు 

ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఎలా ఉంటుంది?

ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఒక ఎంపీకి అధికారికంగా ప్రభుత్వ ఏర్పాటుకు బాధ్యతలు అప్పగించిన తర్వాత.. సదరు ఎంపీ 28 రోజుల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ఈ గడువులోగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోతే, అధ్యక్షుడు మరో 14 రోజులపాటు గడువు పొడిగించవచ్చు.

అయినప్పటికీ నిర్దేశిత సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే.. మరో ఎంపీకి ఈ బాధ్యతలు అప్పగించే అవకాశం అధ్యక్షుడికి ఉంటుంది.

దీంతో ఇజ్రాయెల్‌లో తదుపరి ప్రభుత్వం ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

ADVERTISEMENT