Loading...
Trump: రక్తమోడుతున్న ముఖం.. చేతిలో రెడ్ బ్రా.. ట్రంప్ ఏఐ పోస్టు వెనుక కథేంటి?
రక్తమోడుతున్న ముఖం.. చేతిలో రెడ్ బ్రా.. ట్రంప్ ఏఐ పోస్టు వెనుక కథేంటి?

Trump: రక్తమోడుతున్న ముఖం.. చేతిలో రెడ్ బ్రా.. ట్రంప్ ఏఐ పోస్టు వెనుక కథేంటి?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2026
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఏఐ ఫొటో ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ తిరిగి తన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ట్రంప్ ఈ చిత్రాన్ని తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే, ఈ ఫొటోను రూపొందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. 2024 జూలైలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం సమయంలో తీసిన ప్రసిద్ధ ఫొటోను ఆధారంగా చేసుకుని ఈ ఏఐ చిత్రాన్ని రూపొందించారు. అసలు ఫొటోలో ట్రంప్ ఉన్న స్థానంలో జెన్సన్ హువాంగ్‌ను ఉంచారు. అంతేకాకుండా, అమెరికా జెండా స్థానంలో ఎన్విడియా కంపెనీ జెండాను చేర్చారు.

వివరాలు 

ఏఐ చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న ట్రంప్

హువాంగ్ తన తలపై ఎర్రటి బ్రాను పట్టుకుని విజయగర్వంతో నిలబడినట్లు ఈ చిత్రంలో చూపించారు.

ఈ విచిత్రమైన ఏఐ చిత్రాన్ని ట్రంప్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఎన్విడియా తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని ట్రంప్ తన పోస్టులో ప్రశంసించారు.

జెన్సన్ హువాంగ్ తిరిగి సీఈఓగా బాధ్యతలు చేపట్టడంలో తన పాత్ర ఉందని వెల్లడించారు. ఈ విషయంలో కంపెనీ బోర్డు సభ్యులతో స్వయంగా మాట్లాడి వారిని ఒప్పించినట్లు తెలిపారు.

వారం రోజుల క్రితం ఉన్న పరిస్థితులతో పోలిస్తే, నిన్న వారిని ఒప్పించడం చాలా సులభమైందని పేర్కొన్నారు.

వివరాలు 

హువాంగ్ రాజీనామా వెనుక ఏం జరిగింది?

రెండు వారాల క్రితం జెన్సన్ హువాంగ్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టే అంశంపై ఎన్విడియా బోర్డు జాతీయ భద్రతకు సంబంధించిన కొన్ని హామీలను కోరినట్లు ట్రంప్ వెల్లడించారు.

హువాంగ్ వల్ల అమెరికా జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని నిర్ధారించాలని బోర్డు కోరినట్లు చెప్పారు.

తమకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం హువాంగ్ వల్ల ఎలాంటి సమస్య లేదని బోర్డు సభ్యులకు భరోసా ఇచ్చినట్లు ట్రంప్ తెలిపారు.

ఆయన గొప్ప దేశభక్తుడని, అమెరికాకు ఒక ఆస్తి అని ప్రశంసించారు. జెన్సన్ హువాంగ్ ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడలేదని అటార్నీ జనరల్ ధ్రువీకరించినట్లు కూడా ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ఎగుమతి నియంత్రణలపై విచారణ కొనసాగించాలి

అమెరికా ఎగుమతి నియంత్రణలకు సంబంధించిన అంశాల్లో ఎన్విడియా తన అంతర్గత విచారణను కొనసాగించాలని ట్రంప్ సూచించారు.

చట్టపరమైన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంతోపాటు దేశ జాతీయ భద్రతను కాపాడటం కంపెనీ బాధ్యత అని స్పష్టం చేశారు.

చైనా గూఢచారిగా అనుమానిస్తున్న ఓ మహిళతో హువాంగ్‌కు వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలు గతంలో తెరపైకి వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసినట్లు కథనాలు వెలువడ్డాయి.

ADVERTISEMENT

వివరాలు 

ఎగుమతి నియంత్రణలపై విచారణ కొనసాగించాలి

అయితే, తిరిగి సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటికీ హువాంగ్‌కు కొన్ని విచారణలు ఎదురుకానున్నాయి.

అమెరికా ప్రతినిధుల సభకు చెందిన మూడు కమిటీల ముందు ఆయన క్లోజ్డ్ డోర్ ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

అనంతరం అమెరికా ఏఐ ప్రయోజనాలను ఎలా కాపాడాలనే అంశంపై సెనేట్ బ్యాంకింగ్ కమిటీ నిర్వహించే బహిరంగ విచారణలోనూ పాల్గొనాల్సి ఉంటుంది.

దీంతో హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆయనపై అమెరికా ప్రభుత్వ పరిశీలన కొనసాగనుంది.

ADVERTISEMENT