
Jair Bolsonaro: ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. జైర్ బోల్సోనారోకు 27 ఏళ్ళు జైలు శిక్ష
ఈ వార్తాకథనం ఏంటి
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోకు సైనిక కుట్ర కేసులో 27 ఏళ్ళ 3 నెలల జైలు శిక్ష విధించారు. ఈ శిక్షను దేశ సుప్రీంకోర్టు ప్రకటించింది. 2022లో జరిగిన ఎన్నికల్లో బోల్సొనారో తన ప్రత్యర్థి, వామపక్ష నాయకుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా చేతిలో ఓడిపోయినా కూడా, అధికారాన్ని చేజిక్కించుకోవాలని కుట్రపన్నినట్లు సుప్రీంకోర్టు తేల్చింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ప్యానల్ ఈ శిక్షను ఖరారు చేసింది. దీంతో బ్రెజిల్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చేందుకు కుట్ర పన్నిన కేసులో జైలు శిక్ష పడిన తొలి మాజీ అధ్యక్షుడిగా బోల్సొనారో నిలిచారు.
వివరాలు
కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సైన్యాన్ని చర్యలు చేపట్టాలని డిమాండ్
2022 ఎన్నికలలో ఓటమి పొందిన వెంటనే బోల్సొనారో మద్దతుదారులు రాజధాని బ్రసీలియాలో భయంకర విధ్వంసం సృష్టించారు. దేశాధ్యక్షుడి అధికార నివాసం, పార్లమెంట్ భవనం, సుప్రీంకోర్టు భవనాల్లోకి చొరబడి ధ్వంసం చేశారు. బోల్సొనారో నేతృత్వంలో ఆందోళనకారులు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సైన్యాన్ని చర్యలు చేపట్టాలని, లూలా డా సిల్వాను దింపేయాలని డిమాండ్ చేశారు. "అధికారం మీ చేతుల్లోనే ఉంది. సైన్యం ఇప్పటికీ నా మాటే వింటుంది. దొంగల పాలనను కూల్చేయండి" అని బోల్సొనారో పిలుపునిచ్చారు.
వివరాలు
ఖండించిన డొనాల్డ్ ట్రంప్
అలాగే, బోల్సొనారో దేశ సుప్రీంకోర్టును, ఎన్నికల సంఘాన్ని అవమానిస్తూ, లూలా డిసిల్వా గెలుపు ప్రజల ఓట్ల ద్వారా కాదు, నిష్పక్షపాతమైన వ్యవస్థ కారణంగా వచ్చిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ప్రాసిక్యూటర్ జనరల్ అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు బోల్సొనారోపై మరో 33 మందితో పాటు విచారణ అనుమతించింది. కాగా, బోల్సొనారోకు శిక్ష విధించడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు.