Page Loader
Brazil: బ్రెజిల్‌తో పాటు మరో 7 దేశాలపై ఆంక్షలు.. పోర్చుగీస్ వస్తువులపై 50 శాతం టారీఫ్!
బ్రెజిల్‌తో పాటు మరో 7 దేశాలపై ఆంక్షలు.. పోర్చుగీస్ వస్తువులపై 50 శాతం టారీఫ్!

Brazil: బ్రెజిల్‌తో పాటు మరో 7 దేశాలపై ఆంక్షలు.. పోర్చుగీస్ వస్తువులపై 50 శాతం టారీఫ్!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2025
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటనతో బ్రెజిల్ సహా పలు దేశాలకు వాణిజ్య పరంగా భారీగా దెబ్బ తగిలేలా మారింది. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు మద్దతుగా ఆయన చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. బోల్సోనారోపై కొనసాగుతున్న అవినీతి కేసును తీవ్రంగా విమర్శించిన ట్రంప్, దీనిని గౌరవప్రదమైన అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధంగా అభివర్ణించారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాకు పంపిన లేఖలో ఈ కేసును కొనసాగించవద్దని సూచించారు. అదేవిధంగా బ్రెజిల్ తీసుకుంటున్న వాణిజ్య విధానాలపై అమెరికా త్వరలో విచారణ చేపడుతుందని హెచ్చరించారు.

వివరాలు 

జైర్ బోల్సోనారోకు సపోర్టుగా బ్రెజిల్పై 50 శాతం సుంకాలు విధింపు..

ట్రంప్ మాట్లాడుతూ, జైర్ బోల్సోనారో తనకు సన్నిహిత వ్యక్తి అని, తన అధ్యక్ష పదవీకాలంలో ఆయనతో కలిసి పని చేసిన అనుభవాన్ని గుర్తుచేశారు. ఆ సమయంలో బోల్సోనారోను ప్రపంచ నేతలు ఎంతో గౌరవంతో చూశారని, ప్రస్తుతం బ్రెజిల్ ప్రభుత్వం అతనిపై చేపడుతున్న చర్యలు అనవసరమైన అవమానకర చర్యలుగా అభివర్ణించారు. గతంలో ట్రంప్ బోల్సోనారో తిరుగుబాటు కేసు మీద చేసిన వ్యాఖ్యలపై బ్రెజిల్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో, అమెరికా ఇప్పుడు 50 శాతం టారీఫ్‌తో బ్రెజిల్‌ను ఆర్థికంగా దెబ్బతీయనుంది.

వివరాలు 

బ్రెజిల్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 50 శాతం సుంకం 

కాగా,బ్రెజిల్ ప్రస్తుత అధ్యక్షుడు లులా ద సిల్వా పాలనను తొలగించేందుకు బోల్సోనారో కుట్ర చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే సైన్యం నుండి మద్దతు అందకపోవడంతో ఆ కుట్ర విఫలమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఆరోపణలను బోల్సోనారో పూర్తిగా ఖండించారు.ఈ నేపథ్యంలో వచ్చే ఆగస్టు 1వ తేదీ నుంచి బ్రెజిల్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 50 శాతం అమెరికన్ సుంకం అమల్లోకి రానుంది. ఇది ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు వర్తించే విధానంతో సమానంగా ఉంటుందని ట్రంప్ తెలిపారు. అంతేకాదు,బ్రెజిల్‌తో పాటు అల్జీరియా,ఇరాక్,లిబియా,శ్రీలంకపై 30శాతం సుంకాలు విధించగా, బ్రూనై,మోల్డోవాపై 25శాతం,ఫిలిప్పీన్స్‌పై 20శాతం సుంకాలను ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయాలు అన్ని వాణిజ్య పరంగా సంబంధిత దేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.