BRICS Conference: బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.. భారత్-చైనా సరిహద్దు వివాదంపై కీలక చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
బ్రెజిల్‌లోని రియో డి జనీరో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు వేదిక కానుందని అక్కడి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
జూలై 6, 7 తేదీల్లో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మౌరో వియోరా వెల్లడించారు.
బ్రిక్స్ దేశాల అభివృద్ధి, పరస్పర సహకారం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ఈ సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.
గతేడాది అక్టోబరులో రష్యాలోని కజాన్ నగరంలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగింది.
ఆ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తదితర ప్రపంచ నేతలు హాజరయ్యారు.
Details
అంతర్జాతీయ ఉగ్రవాదం పరిష్కారానికి చర్యలు
ఈ సదస్సులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, అంతర్జాతీయ ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై చర్చించగా, భారత్-చైనా సరిహద్దు వివాద పరిష్కారానికి కూడా చర్యలు చేపట్టారు.
ఈ సదస్సులో బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీ రూపొందించాల్సిన అవసరంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ దృష్టి సారించారు.
ప్రస్తుతం డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారత్‌తో కలిసి రష్యా పని చేస్తోందని పేర్కొన్నారు.
అయితే డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని ప్రవేశపెట్టే యత్నాలు చేస్తే, ఆ దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.