Loading...
UK EU Deal: పదేళ్ల తర్వాత ఈయూకు దగ్గరవుతున్న బ్రిటన్‌.. కీలక ఒప్పందాలపై సంతకాలు
పదేళ్ల తర్వాత ఈయూకు దగ్గరవుతున్న బ్రిటన్‌.. కీలక ఒప్పందాలపై సంతకాలు

UK EU Deal: పదేళ్ల తర్వాత ఈయూకు దగ్గరవుతున్న బ్రిటన్‌.. కీలక ఒప్పందాలపై సంతకాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2026
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

పదేళ్ల క్రితం యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) నుంచి విడిపోయిన బ్రిటన్‌.. ఇప్పుడు మళ్లీ ఆ కూటమికి దగ్గరయ్యే ప్రయత్నాలను ప్రారంభించింది. ఈక్రమంలో శుక్రవారం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈయూ కౌన్సిల్‌ చీఫ్‌ ఆంటోనియో కోస్టా, యూరోపియన్‌ కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులతో బ్రిటన్‌ ప్రధాని ఆండీ బర్న్‌హమ్‌ పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ప్రధానంగా వాణిజ్యం, యువతకు పరస్పర అవకాశాల కల్పనకు సంబంధించిన అంశాలు ఈ ఒప్పందాల్లో ఉన్నాయి. తాజాగా కుదిరిన ఒప్పందాలపై బర్న్‌హమ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రక ఒప్పందమని, బ్రిటన్‌తో పాటు యూరప్‌కు కూడా మంచి రోజని పేర్కొన్నారు. ఈ ఒప్పందాల వల్ల రోజువారీ ఖర్చులు తగ్గడంతోపాటు సూపర్‌ మార్కెట్లలో వస్తువుల ధరలు దిగివస్తాయని చెప్పారు.

వివరాలు

బ్రెగ్జిట్‌తో నష్టమే ఎక్కువ

యువతకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ఈయూ నుంచి వైదొలగడం వల్ల గత దశాబ్ద కాలంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈఒప్పందాలు కుదుర్చుకున్నామని వివరించారు.

'బ్రెగ్జిట్‌ వల్ల ఆశించిన ప్రయోజనాలు కలగలేదు. పొందిన దానికంటే కోల్పోయిందే ఎక్కువ. 27 దేశాలతో కూడిన ఈయూతో మరింత సన్నిహితమయ్యేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నాం. బ్రెగ్జిట్‌ను వెనక్కి తీసుకోవడం సాధ్యమే.

అయితే అది ఇప్పటికిప్పుడు జరిగే పని కాదు. ఇందుకు బ్రిటిష్‌ ఓటర్ల మద్దతుతో పాటు అపనమ్మకంతో ఉన్న ఈయూ సభ్య దేశాల ఏకగ్రీవ మద్దతు కూడా అవసరం' అని బర్న్‌హమ్‌ పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య కూటమిగా ఉన్న ఈయూ నుంచి బ్రిటన్‌ వైదొలిగిన తర్వాత.. తిరిగి ఆ గ్రూపుతో చర్చలు జరపడం ఇదే తొలిసారి.

వివరాలు

ఏటా లక్ష మంది యువతకు అవకాశాలు

తాజా ఒప్పందాల్లో భాగంగా బ్రిటన్‌ నుంచి ఏటా లక్ష మంది యువత, విద్యార్థులను ఈయూ దేశాలకు పంపించేందుకు అవకాశం కలగనుంది.

విద్య, పర్యటన, శిక్షణ, ఉద్యోగాల కోసం వీరు అక్కడికి వెళ్లవచ్చు. ఇదే విధంగా ఈయూ సభ్య దేశాల నుంచి కూడా లక్ష మంది యువత, విద్యార్థులు బ్రిటన్‌కు వెళ్లేందుకు వీలుంటుంది.

అయితే విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులు, ఇతర అంశాలపై మరింత విపులంగా చర్చించి ఆరు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ పథకం కింద వెళ్లేవారికి ఈయూ దేశాలు, బ్రిటన్‌లో మూడేళ్లపాటు ఉండేందుకు వీసాలు మంజూరు చేస్తారు. ఈ ఒప్పందం 2030 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని సమాచారం.

ADVERTISEMENT

వివరాలు

ఆహార ఉత్పత్తుల ధరలూ తగ్గే అవకాశం

మరోవైపు ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న ఆంక్షలను తొలగించేందుకు ఈయూ అంగీకరించింది.

దీంతో ఈ ఉత్పత్తుల ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మొత్తంగా తాజా ఒప్పందాలతో బ్రిటన్‌, ఈయూ మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడటంతో పాటు యువతకు విద్య, ఉద్యోగ, శిక్షణ రంగాల్లో కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

ADVERTISEMENT