
బ్రిటన్ రాజు ప్రతి ఏటా రెండు పుట్టిన రోజులను ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3 అధికారిక పుట్టినరోజును జూన్ 17న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాస్తవానికి కింగ్ చార్లెస్-3 అసలు పుట్టిన రోజు నవంబర్ 14 కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో బ్రిటన్ రాజు రెండు పుట్టిన రోజుల కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రిటన్ రాజు రెండు పుట్టిన రోజులు జరుపుకోవాడానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది 1748 నుంచి సుదీర్ఘకాలంగా సంప్రదాయంగా వస్తుంది.
వాతావరణ కారణాల వల్లే బ్రిటన్ రాజు ప్రతి ఏటా తన అసలు పుట్టిన రోజుతో పాటు మరో బర్త్ డేను అదనంగా జరుపుకుంటారు.
అదనంగా జరుపుకునే పుట్టినరోజునే 'ట్రూపింగ్ ది కలర్'గా పిలుస్తారు. దీన్ని బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది.
బ్రిటన్
1748 నుంచి కొనసాగుతున్న సంప్రదాయం
బ్రిటన్‌లో పుట్టిన రోజును వేడుకలా నిర్వహించడం ఆనవాయితీ. ఆ రోజున భారీ ఎత్తున పరేడ్ నిర్వహిస్తారు. రాజు సైనిక వందనం స్వీకరిస్తారు. సైనిక పరాక్రమాన్ని ప్రదర్శిస్తారు.
అయితే 1748లో జార్జ్ -2 చక్రవర్తిగా ఉన్నప్పుడు ఆయన పుట్టిన రోజు నవంబర్‌లో వచ్చింది.
ఆ సమయంలో భారీగా వర్షాలు పడటంతో వాతావారణం పరేడ్‌కు అనుకూలంగా లేదు.
దీంతోజార్జ్ -2 చక్రవర్తిగా రెండో పుట్టిన రోజు అనే కార్యక్రమానికి నాంది పలికారు. దానికి 'ట్రూపింగ్ ది కలర్' పేరు పెట్టారు.
ప్రతి ఏటా వాతావరణం అనుకూలంగా ఉండే జూన్ నెలలోనే రాజు పుట్టిన రోజును అధికారికంగా నిర్వహించాలని జార్జ్ -2 నిర్ణయించారు.
జార్జ్ -2 ప్రారంభించిన సంప్రదాయాన్ని కింగ్ చార్లెస్-3 కూడా కొనసాగిస్తున్నారు.