Page Loader
సీటుబెల్ట్ ధరించనందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కు జరిమానా
సీటుబెల్ట్ ధరించనందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కు జరిమానా

సీటుబెల్ట్ ధరించనందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కు జరిమానా

వ్రాసిన వారు Stalin
Jan 21, 2023
06:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీటు బెల్ట్ లేకుండా కారులో ప్రయాణించినందుకు ప్రధానమంత్రి రిషి సునక్‌కి యునైటెడ్ కింగ్‌డమ్ పోలీసులు జరిమానా విధించినట్లు బీబీసీ తెలిపింది. కదులుతున్న కారులో సీటుబెల్టు ధరించనందుకు అతనికి 50ఫౌండ్ల జరిమానా విధించారు. ఈ సందర్భంగా రిషి సునక్‌కు క్షమాపణలు చెప్పారు. జరిమానా చెల్లిస్తానని పేర్కొన్నారు. సునక్‌కు పోలీసుల నుంచి అందిన రెండో పెనాల్టీ నోటీసు ఇది. గత సంవత్సరం, మాజీ పీఎం బోరిస్ జాన్సన్‌తో కలిసి కరోనా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. దానికి గానూ యునైటెడ్ కింగ్‌డమ్ పోలీసులు జరిమానా విధంచారు. అలాగే యూకేలో ట్రాఫిక్ చట్టాన్ని ఉల్లంఘింటిన రెండో ప్రధానిగా సునక్ నిలిచారు. అంతకు ముందు బోరిస్ జాన్సన్‌ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారు. ఆ సమయంలో అతను తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు.

రిషి సునక్‌

ప్రధాన మంత్రి రిషి సునక్‌ పేరు చెప్పని యూకే పోలీసులు

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల వ్యవహారంలో ప్రధాన మంత్రి రిషి సునక్‌ పేరును యూకే పోలీసులు ప్రస్తావించకుండానే ప్రకటన విడుదల చేశారు. లండన్‌కు చెందిన 42ఏళ్ల వ్యక్తికి షరతులతో కూడిన జరిమానా విధించినట్లు పోలీసులు వెల్లడించారు. లాంకషైర్‌లో కదులుతున్న కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి సీటు బెల్టు ధరంచని వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అది చూసి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఇటీవల కారులో ప్రయాణిస్తూ, దేశాభివృద్ధి కోసం తాను చేస్తున్న పనులను సోషల్ మీడియాలో రిషి సునక్‌ పంచకున్నారు. అయితే ఆ సమయంలో రిషి సునక్‌ సీటు బెల్టు ధరించలేదు. అది చూసి పోలీసులు జరిమానా విధించారు.