Loading...
womans murder in Canada: టొరంటోలో భారత యువతి దారుణ హత్య.. ఏడు నెలలకు చిక్కిన నిందితుడు
టొరంటోలో భారత యువతి దారుణ హత్య.. ఏడు నెలలకు చిక్కిన నిందితుడు

womans murder in Canada: టొరంటోలో భారత యువతి దారుణ హత్య.. ఏడు నెలలకు చిక్కిన నిందితుడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 09, 2026
01:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలో భారత యువతి హత్య కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. హత్య జరిగిన ఏడు నెలల తర్వాత నిందితుడిని అరెస్టు చేశారు. టొరంటోలో గత డిసెంబరులో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన 30 ఏళ్ల హిమాన్షీ ఖురానా హత్య కేసులో 32 ఏళ్ల అబ్దుల్ గఫూరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టొరంటోలోని ఓ నివాసంలో హిమాన్షీ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. తొలుత ఆమె మృతి అనుమానాస్పదంగా భావించిన పోలీసులు.. దర్యాప్తు అనంతరం ఇది హత్యగా నిర్ధారించారు. విచారణలో హిమాన్షీకి అబ్దుల్ గఫూరీతో సన్నిహిత సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అయితే హత్య అనంతరం గఫూరీ కెనడా నుంచి పరారయ్యాడు. దీంతో అతడి కోసం టొరంటో పోలీసులు అంతర్జాతీయ ఏజెన్సీల సహకారంతో గాలింపు చేపట్టారు.

వివరాలు

టొరంటో ఎయిర్‌పోర్ట్‌లో నిందితుడు అరెస్టు

నిందితుడిని పట్టుకునేందుకు కెనడా వ్యాప్తంగా అరెస్టు వారెంట్ కూడా జారీ చేశారు. ఈ క్రమంలో గఫూరీని కెనడాకు రప్పించిన అధికారులు.. శుక్రవారం టొరంటో ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టు చేశారు.

అతడిపై ఫస్ట్‌ డిగ్రీ హత్య (ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య) అభియోగాన్ని నమోదు చేశారు. ఇదిలా ఉండగా, హిమాన్షీ ఖురానా మృతిపై టొరంటోలోని భారత రాయబార కార్యాలయం గతంలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

ఆమె కుటుంబానికి అధికారులతో కలిసి అన్ని విధాలా సహకారం అందిస్తామని అప్పట్లో ప్రకటించింది. తాజాగా నిందితుడి అరెస్టుతో ఈ కేసులో దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది.

ADVERTISEMENT