LOADING...
Donald Trump: 'అమెరికా నుంచి చమురు కొనండి'.. హోర్ముజ్ నిర్బంధం మధ్య ట్రంప్ హెచ్చరిక..
'అమెరికా నుంచి చమురు కొనండి'.. హోర్ముజ్ నిర్బంధం మధ్య ట్రంప్ హెచ్చరిక..

Donald Trump: 'అమెరికా నుంచి చమురు కొనండి'.. హోర్ముజ్ నిర్బంధం మధ్య ట్రంప్ హెచ్చరిక..

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2026
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన కొరతతో ఇబ్బందులు పడుతున్న దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన హెచ్చరికలు చేశారు. ఇంధనం కావాలంటే అమెరికా నుంచి కొనుగోలు చేయాలి లేదా ఇరాన్ మూసేసిన చేసిన హోర్ముజ్ జలసంధి ద్వారా మీరే సేకరించుకోవాలని సూచించారు. యుద్ధంలో పాల్గొనకుండా వెనుకంజ వేసిన మిత్రదేశాలపై కూడా ఆయన విమర్శలుగుప్పించారు. ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ,ఇంధన సరఫరా అంతరాయం కారణంగా ప్రభావితమైనదేశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాలు యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించడాన్ని ఆయన తప్పుపట్టారు. హోర్ముజ్ జలసంధి మూసివేత వల్ల జెట్ ఫ్యూయల్ దొరకని దేశాలు అమెరికా నుంచి కొనుగోలు చేయాలని,లేకపోతే ధైర్యం చేసి అక్కడికి వెళ్లి స్వయంగా తీసుకోవాలని వ్యాఖ్యానించారు.

వివరాలు 

హోర్ముజ్ జలసంధి దిగ్బంధనంతో తీవ్ర ప్రభావం

Strait of Hormuz ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం నిర్వహించే కీలక మార్గం. ఫిబ్రవరి 28న అమెరికా పరిమిత సైనిక చర్య ప్రారంభించిన వెంటనే ఇరాన్ ఈ జలసంధిని దిగ్బంధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా చేరాయి. ముందుగా ఇవి సుమారు 75 డాలర్ల వద్ద ఉండేవి. ఇప్పటివరకు ట్రంప్ ప్రభుత్వం ఈ జలసంధిని తిరిగి తెరవడంలో విఫలమైంది. ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, మిత్రదేశాలను నౌకాదళాన్ని పంపాలని కోరినా, పెద్దగా స్పందన రాలేదు.

వివరాలు 

మిత్రదేశాలపై అసంతృప్తి.. స్వయంగా పోరాడాలని సూచన

పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండగా, ట్రంప్ తన వ్యాఖ్యలను మరింత కఠినతరం చేశారు. ప్రభావిత దేశాలు ఇకపై తమ రక్షణను తామే చూసుకోవాలని చెప్పారు. "మీ కోసం మీరు పోరాడడం నేర్చుకోవాలి.. మీరు మా కోసం రాలేదు కాబట్టి ..మేము మీకు సహాయం చేయం," అని పేర్కొన్నారు. ఇరాన్ దాదాపు బలహీనపడిందని ట్రంప్ పేర్కొన్నారు. కఠిన భాగం పూర్తైందని చెప్పి, దేశాలు తమకు అవసరమైన చమురును స్వయంగా తీసుకురావాలని సూచించారు.

Advertisement

వివరాలు 

ఫ్రాన్స్‌పై కూడా విమర్శలు

ఇదే సమయంలో, ఫ్రాన్స్‌పై కూడా ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌కు సైనిక సరఫరాలు తీసుకెళ్తున్న అమెరికా విమానాలకు తమ గగనతలం ఉపయోగించేందుకు అనుమతించలేదని తెలిపారు. ఫ్రాన్స్ వ్యవహారం అమెరికాకు అనుకూలంగా లేదని వ్యాఖ్యానించారు. ఇరాన్‌కు మరో హెచ్చరిక ఇరాన్ శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే, వారి ఇంధన ప్లాంట్లను పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అలాగే ఇరాన్ ముఖ్య చమురు ఎగుమతి కేంద్రం అయిన ఖార్గ్ దీవిని కూడా లక్ష్యంగా చేసుకుంటామని చెప్పారు. అంతకుముందు వైట్ హౌస్ ప్రకారం, ఏప్రిల్ 6లోపు హోర్ముజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ కోరారు. అయితే అవసరమైతే సైనిక చర్యలను నిలిపివేసి, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపై తరువాతి దశలో చేపట్టే అవకాశం ఉందని సమాచారం.

Advertisement