Canada Shooting: కెనడాలో కాల్పుల మోత.. అయిదుగురి మృతి
కెనడాలోని ఉత్తర అంటారియో నగరంలో ముగ్గురు పిల్లలు,షూటర్‌తో సహా ఐదుగురు వ్యక్తులు తుపాకీ కాల్పుల్లో మరణించినట్లు కెనడియన్ పోలీసులు బుధవారం తెలిపారు. సమీపంలోని రెండు ఇళ్లలో జరిగిన హింస వల్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు కాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో 6,7, 12, 41 ఏళ్ల వయసున్న వారు మరణించారని పోలీసులు తెలిపారు. కెనడియన్ పోలీసుల ప్రకారం, రాత్రి 10:20 గంటలకు వారికి ఫోన్ కాల్ వచ్చింది. టాన్‌క్రెడ్ స్ట్రీట్‌లోని ఒక ఇంట్లో తుపాకీ గాయం వల్ల 41 ఏళ్ల వ్యక్తి చనిపోయాడని కనుగొన్నారు.
తుపాకీ కాల్పులలో ముగ్గురు పిల్లలు
పది నిమిషాల అనంతరం, సమీపంలోని నివాసంలో తుపాకీ కాల్పులు జరిగినట్లు వారికి మరో కాల్ వచ్చింది. తదనంతరం, వారు కాల్చి చంపబడిన ముగ్గురు పిల్లలను కనుగొన్నారు. వారితో పాటు, తనకు తానూ తుపాకీతో కాల్చుకొని మరణించిన 41 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని కూడా అధికారులు కనుగొన్నారని కెనడియన్ బ్రాడ్‌కాస్టర్ CBC న్యూస్ నివేదించింది. వేర్వేరు ప్రదేశాలలో జరిగిన ఈ మరణాలు హింస వల్ల జరిగిన కాల్పుల వల్ల సంభవించాయని ప్రాథమిక దర్యాప్తులో కనుగొన్నారు.