LOADING...
Canada Post: దీపావళికి ప్రతీకగా స్టాంప్.. రిలీజ్ చేసిన కెనడా పోస్టు 
దీపావళికి ప్రతీకగా స్టాంప్.. రిలీజ్ చేసిన కెనడా పోస్టు

Canada Post: దీపావళికి ప్రతీకగా స్టాంప్.. రిలీజ్ చేసిన కెనడా పోస్టు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 25, 2025
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

బహుళ సంస్కృతుల కలయికకు ప్రతీకగా కెనడా దేశ తపాలా శాఖ దీపావళి స్టాంప్‌ను విడుదల చేసింది. దీపావళి పండగ నేపథ్యంలో సంప్రదాయ రంగోలితో రూపొందించిన ఈ స్టాంప్‌ను ఆవిష్కరించినందుకు కెనడా పోస్ట్‌కు ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం గురువారం సామాజిక మాధ్యమాల్లో కృతజ్ఞతలు తెలియజేసింది.

Details

రంగోలి చిత్రంతో పాటు, హిందీ, ఆంగ్లంలో 'దీపావళి'

కెనడా తపాలా శాఖ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించినట్లుగా, 'దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని గుర్తిస్తూ, కెనడా మానవ సమాజంలో ఉన్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు మరియు ఇతర వర్గాలు జరుపుకొనే దీపావళి పండగను గుర్తిస్తూ స్టాంప్‌ను విడుదలించడం గర్వంగా ఉందని పేర్కొంది. 2017 నుండి కెనడా పోస్ట్ ప్రతీ ఏటా దీపావళి సందర్భంగా ప్రత్యేక స్టాంప్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ఈ ఏడాది స్టాంప్‌లో భారతీయ కళాకారిణి రూపొందించిన రంగోలి చిత్రంతో పాటు, హిందీ, ఆంగ్లంలో 'దీపావళి' అనే శీర్షికను చేర్చారు.

Advertisement