Canada: విదేశీ విద్యార్థులు,విదేశీ కార్మికుల పర్మిట్లు తగ్గింపు.. కెనడా కీలక నిర్ణయం
కెనడా ప్రభుత్వం వలసలను నియంత్రించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో తాత్కాలిక నివాసితుల సంఖ్యను తగ్గించడానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు, వలసవారికి పని అనుమతులపై కఠినమైన నియంత్రణలు విధించనుంది. ఈ నిర్ణయం దేశంలో పెరుగుతున్న ఇళ్ల కొరత,నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికే తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా ప్రకటన ప్రకారం, 2025లో విదేశీ విద్యార్థుల కోసం స్టడీ పర్మిట్ల సంఖ్యను 4,37,000కు పరిమితం చేయాలని నిర్ణయించారు. 2023లో ఈ సంఖ్య 5,09,390గా ఉండగా, ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 1,75,920 స్టడీ పర్మిట్లు జారీ చేశారు. అంతేకాక, విదేశీ వర్కర్లు, విద్యార్థుల భాగస్వాములకు పని అనుమతులపైనా పరిమితులు విధించనున్నారు.