Nijjar: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కు.. కెనడా పార్లమెంట్ నివాళి
కెనడా పార్లమెంట్ మంగళవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో కొద్దిసేపు మౌనం పాటించి హర్దీప్ సింగ్ నిజ్జర్ కు నివాళి అర్పించింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ మరణించి ఏడాది అయిన సంగతి తెలిసిందే. గత ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని గురుద్వారా వెలుపల కెనడాలోని సర్రేలో జరిగిన కాల్పుల్లో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కెటిఎఫ్)చీఫ్ నిజ్జర్ మరణించారు. భారత ప్రభుత్వం విడుదల చేసిన'40మంది నిషేధిత ఉగ్రవాదుల' జాబితాలో అతని పేరు ఉంది. కరణ్ బ్రార్,అమన్‌దీప్ సింగ్,కమల్‌ప్రీత్ సింగ్ ,కరణ్‌ప్రీత్ సింగ్‌లతో సహా నలుగురు భారతీయులు నిజ్జర్‌ను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య,దీనిలో కెనడా భారత ప్రభుత్వ పాత్ర ఉందని పేర్కొంది.ఈ పరిణామాలు ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపాయి.
మోదీతో మాట్లాడిన కెనడా ప్రధాని
అయితే, ఈ నెల ప్రారంభంలో, ఇటలీలో G7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం .. ఆర్థిక సంబంధాలు , జాతీయ భద్రతతో సహా కొత్త ప్రభుత్వంతో చర్చించే "అవకాశం" ఉందని చెప్పారు.
హర్దీప్ సింగ్ నిజ్జర్ ఎవరు?
నకిలీ పాస్‌పోర్ట్‌తో 1997లో కెనడాకు వెళ్లిన తర్వాత, నిజ్జర్ శరణార్థి పిటిషన్ ను తిరస్కరించారు. ఆ తర్వాత అతను ఇమ్మిగ్రేషన్ కోసం స్పాన్సర్ చేసిన మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ పిటిషన్ కూడా తిరస్కరించారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఆయన మరణించిన వెంటనే, ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో పార్లమెంటులో కెనడా జాతీయుడిగా పిలిచారు. నిజ్జర్, భద్రతా సంస్థల ప్రకారం, నిషేధిత ఉగ్రవాద సంస్థ KTF కోసం చురుకుగా వ్యక్తులను నియమించడం,శిక్షణ ఇస్తుంటాడు. అతను సెప్టెంబర్ 10న ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన వేర్పాటువాద సంస్థ సిక్కుస్ ఆఫ్ జస్టిస్‌లో కూడా సభ్యుడు.
కెనడాకు నిజ్జర్ పై అభ్యంతరాలను తెలిపిన భారత్
కొన్నేళ్లుగా, నిజ్జర్ కార్యకలాపాలకు సంబంధించి భారతదేశం అనేకసార్లు తన అభ్యంతరాలను కెనడాకు తెలిపింది. 2018లో, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వాంటెడ్ వ్యక్తుల జాబితాను ప్రధాని జస్టిన్ ట్రూడోకు నిజ్జర్ పేరుతో ఇచ్చారు. 2022లో, పంజాబ్ పోలీసులు రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్న కేసుల్లో నిజ్జార్‌ను అప్పగించాలని కోరింది. 2017 లూథియానా పేలుడుతో సహా వివిధ కేసుల్లో నిజ్జార్ పాత్ర వుందని పంజాబ్ పోలీసులు చెపుతున్నారు. ఇది ఆరుగురి ప్రాణాలను బలిగొంది .మరో 42 మంది గాయపడ్డారు.