Page Loader
Canadian Police:భారత్‌ మీడియాపై కెనడా పోలీసులు అక్కసు..తప్పుగా రిపోర్టింగ్‌ చేస్తోందంటూ..
భారత్‌ మీడియాపై కెనడా పోలీసులు అక్కసు..తప్పుగా రిపోర్టింగ్‌ చేస్తోందంటూ..

Canadian Police:భారత్‌ మీడియాపై కెనడా పోలీసులు అక్కసు..తప్పుగా రిపోర్టింగ్‌ చేస్తోందంటూ..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2024
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రిమినల్ గ్యాంగ్‌ల నుండి కెనడా వాసులకు ప్రస్తుతం ఎలాంటి ముప్పులేదు అని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ అధికారిణి బ్రిగెట్ గౌవిన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. కెనడాకు చెందిన సీబీసీ న్యూస్‌కు ఆదివారం ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. కెనడాలో జరుగుతున్న హింసకు భారత ప్రభుత్వ హస్తం ఉందని ఆర్సీఎంపీ కొన్ని కాలం క్రితం ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిగెట్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

వివరాలు 

కొన్ని ఆధారాలను భారత ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు చూపించాలనుకున్నాం: బ్రిగెట్

"మేము చాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలిగాం. కొన్ని ఆధారాలను భారత ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు చూపించాలనుకున్నాం. కానీ, అవి విఫలమయ్యాయి. భారత మీడియా ఈ విషయాన్ని తప్పుగా రిపోర్ట్ చేస్తోంది. మేము వాటిని సరిచేయాలనుకుంటున్నాం" అని బ్రిగెట్ అన్నారు.