Page Loader
JP Morgan : ఏటిఎంలలో నిధులు డ్రా చేసిన కస్టమర్లపై కేసులు నమోదు
ఏటిఎంలలో నిధులు డ్రా చేసిన కస్టమర్లపై కేసులు నమోదు

JP Morgan : ఏటిఎంలలో నిధులు డ్రా చేసిన కస్టమర్లపై కేసులు నమోదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 29, 2024
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని ప్రముఖ బ్యాంక్‌ జేపీ మోర్గాన్‌ చెస్‌ ఏటిఎంల్లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని ఆసరాగా తీసుకుని నిధులు తీసుకున్న కస్టమర్లపై కేసులు నమోదు చేశారు. ఈ ఇన్ఫినిట్‌ మనీ గ్లిచ్‌ కారణంగా ఖాతాదారులు పెద్ద మొత్తంలో చెక్కును స్వయంగా రాసుకుని, డిపాజిట్‌ చేసి, చెక్కు బౌన్స్‌ కాకముందే డబ్బులు డ్రా చేసుకున్నారు. హ్యూస్టన్‌, మియామీ, లాస్‌ఏంజెల్స్‌ కోర్టులలో ఇద్దరు వ్యక్తులు, రెండు వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న ఈ కేసుల్లో, జేపీ మోర్గాన్‌ చెస్‌ బ్యాంక్‌ వారికి ఇచ్చిన మొత్తాన్ని వడ్డీతోపాటు, ఓవర్డ్రాఫ్ట్‌ ఫీజులు, లీగల్‌ ఖర్చులు, ఇతర నష్టాలు కూడా తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేస్తోంది. జేపీ మోర్గాన్‌ చెస్‌ తన కస్టమర్లను రక్షించడానికి, బ్యాంకింగ్‌ వ్యవస్థను సురక్షితంగా ఉంచడానికి కట్టుబడి ఉందన్నారు

Details

పెద్ద మొత్తంలో నిధులు డ్రా చేశారు

దొంగతనం చేసినవారిని చట్టపరంగా చర్యలు తీసుకోవడం తమ బాధ్యత అని కోర్టులో స్పష్టం చేసింది. ఈ కేసులో, ఆగస్టు 29న ఒక వ్యక్తి తన ఖాతాలో $3,35,000 చెక్కును డిపాజిట్‌ చేసి, పెద్ద మొత్తంలో నిధులు డ్రా చేశారు. అయితే చెక్కు బోగస్‌ అని నిర్ధారించిన తర్వాత కూడా అతను బ్యాంకుకు ఇంకా రూ.2,90,000 మేర తిరిగి చెల్లించాల్సి ఉంది. ఈ నాలుగు కేసుల్లో డిఫెండెంట్లు తీసుకున్న మొత్తం రూ. $6,60,000గా జేపీ మోర్గాన్‌ చెస్‌ లాయర్లు తెలిపారు. అమెరికాలో సాధారణంగా బ్యాంకులు క్లీర్డ్‌ కాకముందు మాత్రమే చెక్కు విలువలో కొంత భాగాన్ని మాత్రమే డ్రా చేసే అవకాశం ఇస్తాయి.