
Zelensky: నాటోలో చేర్చితేనే కాల్పుల విరమణ.. జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
సుదీర్ఘంగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే ప్రశ్న ఇంకా మిగిలే ఉంది.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేవలం నాటో మద్దతు ద్వారా మాత్రమే యుద్ధానికి ముగింపు తేవచ్చని తెలిపారు. బ్రిటన్ మీడియా సంస్థ స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
తమ నియంత్రణలో ఉన్న భూభాగానికి నాటో భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చితే, కాల్పుల విరమణకు తాము అంగీకరిస్తామని అని జెలెన్‌స్కీ చెప్పారు.
ఆ తర్వాత రష్యా ఆక్రమించిన ప్రాంతాలను కూడా దౌత్యపరంగా వెనక్కి సాధించేందుకు ప్రయత్నాలు చేయగలమని, అయితే నాటోలో ఉక్రెయిన్ దేశాన్ని మొత్తం చేర్చుకోవడమే దీని పరిష్కార మార్గమని ఆయన స్పష్టం చేశారు.
Details
ఏ దేశామూ హామీ ఇవ్వలేదన్న నాటో
ఇప్పటి వరకు నాటోలోని ఏ దేశమూ ఈ మేరకు హామీ ఇవ్వలేదని తెలిపారు.
తమ దేశంలో కొంత భాగాన్ని మాత్రమే నాటోలో చేర్చుకోవడం అన్యాయమేనని, ఉక్రెయిన్ అంటే తమ మొత్తం భూభాగమని, రష్యా ఆక్రమిత ప్రాంతాలను తాము వదిలే ప్రసక్తే లేదన్నారు.
2022 ఫిబ్రవరిలో రష్యా సైనిక చర్య మొదలైనప్పటి నుంచి ఈ యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తోంది.
ఇటీవలి కాలంలో అమెరికా ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులను అందించడంపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఈ క్షిపణులను మాస్కోపై వాడుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు బైడెన్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఈ యుద్ధం ముగింపు కోసం జెలెన్‌స్కీ ప్రతిపాదనలు చేసినా, అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందనేది కీలకంగా మారింది.