Zohran Mamdani: ట్రంప్ సౌండ్ పెంచుకొని వినండి: నెహ్రూ మాటలు గుర్తుచేసిన మమ్‌దానీ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా స్థానిక ఎన్నికల్లో న్యూయార్క్ మేయర్ పదవిని డెమోక్రటిక్ పార్టీకి చెందిన జొహ్రాన్ మమ్‌దానీ (Zohran Mamdani) దక్కించుకున్నారు. ఈ పదవిని గెలుచుకున్న మొదటి భారతీయ మూలాలున్న అమెరికన్ ముస్లిం నేతగా ఆయన చరిత్రలో నిలిచారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత తన విజయం వెనుక నిలిచిన ప్రతి మద్దతుదారుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. విజయ ప్రసంగంలో మమ్‌దానీ మాట్లాడుతూ, భారత దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగాన్ని గుర్తు చేశారు. ''న్యూయార్క్‌లోని కొత్త తరానికి ధన్యవాదాలు. మేం మీ కోసం ఎప్పటికీ పోరాడుతాము... ఎందుకంటే మేం మీలోని భాగమే. భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మనం ఒక పరంపర ఆధిపత్యాన్ని చెరిపేశాం'' అని వ్యాఖ్యానించారు.
వివరాలు
జనవరి 1న అధికారికంగా మేయర్‌గా ప్రమాణ స్వీకారం
''ట్రంప్, మీరు ఈ దృశ్యాన్ని చూస్తున్నారని నాకు తెలుసు. మీకు చెబుదామనుకున్న నాలుగు మాటలు ఇవే... మా వారిని ఎవరైనా అడ్డుకోాలంటే ముందు మమ్మల్నందరినీ దాటాలి'' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిస్పందనగా ట్రంప్ 'ట్రూత్ సోషల్'లో ''ఇది ప్రారంభమవుతుంది'' అంటూ స్పందించారు. ''మార్పుకు దారితీసే తీర్పు ఈ రాత్రే వెలువడింది. నేను జనవరి 1న అధికారికంగా మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తాను'' అని జొహ్రాన్ మమ్‌దానీ తెలిపారు. ఈ సందర్భంలో నెహ్రూ ప్రసంగం 'ట్రిస్ట్ విత్ డెస్టినీ'లోని భావాన్ని తన విజయంతో అనుసంధానిస్తూ - ''కొత్త యుగం వైపు అడుగులు వేయబడినప్పుడు,శతాబ్దాలుగా అణచివేతను ఎదుర్కొన్న ఒక వర్గం తన గళాన్ని వినిపించినప్పుడు... అలాంటి సందర్భాలు చరిత్రలో అరుదు'' అని పేర్కొన్నారు.
వివరాలు
మహమూద్ మమ్‌దానీ,మీరా నాయర్ దంపతులకు జన్మించిన జొహ్రాన్ మమ్‌దానీ
అంతేకాకుండా, ఒకసారి రిచర్డ్ అనే ట్యాక్సీ డ్రైవర్‌తో కలిసి సిటీ హాల్ బయట 15 రోజులు నిరాహార దీక్ష చేసిన అనుభవంను కూడా ఈ సందర్భంలో గుర్తుచేశారు. ''ఈ నగరం మీది, ప్రజాస్వామ్యం కూడా మీ సొంతం'' అని అన్నారు. తన తల్లిదండ్రుల గురించిన గౌరవాన్ని కూడా వ్యక్తం చేస్తూ - ''నన్ను తీర్చిదిద్దింది మీరు. మీ కుమారుడిని కావడం నాకు గర్వంగా ఉంది'' అని భావోద్వేగంతో మాట్లాడారు. సోషలిస్టు భావజాలం కలిగిన మమ్‌దానీ, ఈ ఎన్నికల్లో న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై గెలవడం మరో ప్రత్యేకత. జొహ్రాన్ మమ్‌దానీ ఉగాండాకు చెందిన ఆలోచనా వేత్త మహమూద్ మమ్‌దానీ, భారతీయ సినీ దర్శకురాలు మీరా నాయర్ దంపతులకు జన్మించారు.
వివరాలు
34 ఏళ్ల వయస్సులోనే న్యూయార్క్ మేయర్‌గా బాధ్యతలు
ఈ ఎన్నికను డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన పోటీగా భావించి, స్వయంగా ప్రచారంలో పాల్గొన్నప్పటికీ, ఫలితం ఆయనకు అనుకూలంగా రాలేదు. కేవలం 34 ఏళ్ల వయస్సులోనే న్యూయార్క్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న నాయకుడిగా మమ్‌దానీ రికార్డులో నిలిచారు. విజయం తరువాత మేయర్ కార్యాలయం దృశ్యాలను సోషల్ మీడియాలో కూడా పంచుకున్నారు.