Page Loader
USA: హత్య కేసులో పొరపాటుగా 10ఏళ్ళ జైలు.. రూ.419 కోట్ల పరిహారం
హత్య కేసులో పొరపాటుగా 10ఏళ్ళ జైలు.. రూ.419 కోట్ల పరిహారం

USA: హత్య కేసులో పొరపాటుగా 10ఏళ్ళ జైలు.. రూ.419 కోట్ల పరిహారం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2024
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

నేరం చేయకపోయినా 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఒక వ్యక్తిని ఇటీవల కోర్టు నిర్దోషిగా తేల్చి విడుదల చేసింది. ఇంతకాలం అన్యాయంగా జైలు జీవితం గడిపినందుకు అతనికి 50 మిలియన్‌ డాలర్ల(రూ.419 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ సంచలన తీర్పు అమెరికాలోని చికాగో ఫెడరల్‌ జ్యూరీ కోర్టు ప్రకటించింది. 2008లో 19ఏళ్ల యువకుని హత్య కేసులో మార్సెల్‌ బ్రౌన్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో జరిగిన విచారణలో అతనికి 35 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది.కానీ, 2018లో బ్రౌన్‌ తరఫున న్యాయవాదులు అతడిని బలవంతంగా నేరం ఒప్పించారని సాక్ష్యాధారాలు సమర్పించారు. ఈ ఆధారాల ఆధారంగా, కోర్టు కేసును రద్దు చేసి బ్రౌన్‌ను విడుదల చేసింది.

వివరాలు 

న్యాయం జరిగినందుకు కృతజ్ఞతలు: బ్రౌన్‌

తర్వాత బ్రౌన్‌ తనపై పెట్టిన తప్పుడు కేసును సవాల్‌ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. విచారణ జరిపిన చికాగో ఫెడరల్‌ కోర్టు, అతడికి 50 మిలియన్‌ డాలర్ల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఇందులో 10 మిలియన్‌ డాలర్లు తప్పుడు అరెస్టు కోసం, మిగిలిన 40 మిలియన్‌ డాలర్లు 10 ఏళ్ల జైలు శిక్షకు పరిహారం. ఈ తీర్పుపై బ్రౌన్‌ సంతోషం వ్యక్తం చేస్తూ, చివరకు తనకు న్యాయం జరిగినందుకు కృతజ్ఞతలు తెలిపారు.