Page Loader
Obaidul Hassan: మళ్లీ చెలరేగిన అల్లర్లు.. బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ రాజీనామా
మళ్లీ చెలరేగిన అల్లర్లు.. బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ రాజీనామా

Obaidul Hassan: మళ్లీ చెలరేగిన అల్లర్లు.. బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ రాజీనామా

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 10, 2024
06:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ లో మరోసారి ఆందోళనకారులు చెలరేగాయి. గత కొద్ది రోజులగా దేశంలో జరుగుతున్న హింస, అశాంతి కారణంగా మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన విషయం తెలిసిందే. ఇక కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వాన్ని సంప్రదించకుండా చీఫ్ జస్టిస్ ఫుల్ కోర్టు సమావేశం నిర్వహించడంలో నిరసనలు చెలరేగాయి. దీంతో చీఫ్ జస్టిన్ ఒబైదుల్ హసన్ రాజీనామా చేశారు. శనివారం సాయంత్రం బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ కు తన రాజీనామాను ఇవ్వనున్నారు.

Details

రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన

అయితే జడ్జీల భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకొని తన పోస్టుకు రాజీనామా చేయనున్నట్లు చీఫ్ జస్టిన్ ఇవాళ జర్నలిస్టులకు చెప్పారు. ఇక రాజీనామా చేసేందుకు కొన్ని ఫార్మాల్టీలు ఉన్నాయని, వాటిని పూర్తి చేస్తామన్నారు. అయితే చీఫ్ జస్టిస్‌తో పాటు అపిల్లేట్ డివిజన్ జడ్జీలు మధ్యాహ్నం ఒంటి గంట లోపల రాజీనామా చేయాలని విద్యార్థులు హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో న్యాయవాదులు రాజీనామాకు సిద్ధమయ్యారు.