NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Israel Hamas War:ఇజ్రాయెల్ ఎలైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ 'యూనిట్ 8200' చీఫ్ రాజీనామా.. ఎందుకంటే 
    తదుపరి వార్తా కథనం
    Israel Hamas War:ఇజ్రాయెల్ ఎలైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ 'యూనిట్ 8200' చీఫ్ రాజీనామా.. ఎందుకంటే 

    Israel Hamas War:ఇజ్రాయెల్ ఎలైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ 'యూనిట్ 8200' చీఫ్ రాజీనామా.. ఎందుకంటే 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 13, 2024
    11:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అక్టోబరు 7న హమాస్‌ చేసిన దాడులతో ఇజ్రాయెల్‌ తీవ్ర అనిశ్చితిలో పడింది. ఈ దాడులకు సంబంధించిన బాధ్యతను స్వీకరించి, భద్రతా అధికారులు క్షమాపణలు తెలిపారు.

    ఈ నేపథ్యంలో, ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ 'యూనిట్‌ 8200' ప్రధానిగా పనిచేస్తున్న యాస్సి సారిల్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఇజ్రాయెల్‌ భద్రతా అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

    అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేసిన దాడులను అడ్డుకోవడంలో విఫలమయ్యామని సారిల్‌ తెలిపారు.

    ఈ దాడులకు బాధ్యత వహిస్తూ, తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

    ఇదివరకు, అక్టోబరు 7నాటి వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్‌ మిలటరీ నిఘా విభాగం అధిపతి మేజర్‌ జనరల్‌ అహరోన్‌ హలీవా ఏప్రిల్‌లో రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

    వివరాలు 

    దాడుల్లో 1200 మంది మృతి 

    2023 సెప్టెంబరులోనే హమాస్‌ తమ దేశంపై దాడి చేయాలని యత్నిస్తున్నట్టు 'యూనిట్‌ 8200' నివేదికలో హెచ్చరించినట్లు జూన్‌లో అధికారులు వెల్లడించారు.

    ఈ దాడుల్లో 1200 మంది ప్రాణాలు కోల్పోయారు మరియు 250 మంది బందీలుగా తీసుకెళ్లబడినట్లు సమాచారం.

    అయితే, గాజాలో యుద్ధం ముగిసేవరకు ఈ దాడులపై విచారణ చేపట్టేందుకు ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు నెతన్యాహు నిరాకరించారు.

    ప్రస్తుతం, గాజాలో కనీసం 41,118 మంది మృతి చెందినట్లు భూభాగ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది, మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు మరియు మహిళలు అని తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    Israel : గాజా ప్రధాన ఆస్పత్రిలో పెను విషాదం.. 179 మంది సామూహిక ఖననం ప్రపంచ ఆరోగ్య సంస్థ
    ISRAEL : గాజాలోని అల్ షిఫా ఆస్పత్రిలో ఆయుధాలు లభ్యం.. ఇజ్రాయెల్ దళాల గాలింపులు ఇజ్రాయెల్
    Israel Hamas war: బంధీల విడుదల కోసం 5రోజుల పాటు కాల్పుల విరమణ  హమాస్
    Israel shares video: 'అల్-షిఫా' ఆస్పత్రిలో బందీలను దాచిపెట్టిన హమాస్ ఉగ్రవాదులు.. వీడియో విడుదల హమాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025