Page Loader
Chile Wildfires: చిలీలో కార్చిచ్చు కారణంగా 112 మంది మృతి.. 
Chile Wildfires: చిలీలో కార్చిచ్చు కారణంగా 112 మంది మృతి..

Chile Wildfires: చిలీలో కార్చిచ్చు కారణంగా 112 మంది మృతి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2024
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

మూడు రోజులుగా చిలీని అతలాకుతలం చేస్తున్న కారుచిచ్చు కారణంగా 112మంది మరణించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు AFPకి నివేదించారు. అంతర్గత మంత్రి కరోలినా తోహా మాట్లాడుతూ.. చిలీ చరిత్రలో ఈ కార్చిచ్చు "నిస్సందేహంగా" అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదం అన్నారు. ఆదివారం నాటికి, మధ్య,దక్షిణ ప్రాంతాలలో దాదాపు 26,000 హెక్టార్లు (64,000 ఎకరాలు) కాలిపోయాయని ,జాతీయ విపత్తు సేవ అయిన SENAPREDని ఉటంకిస్తూ AFP నివేదించింది. పెద్ద ఎత్తున చెలరేగుతున్న మంటలు, దట్టమైన పొగ నేపథ్యంలో చాలా మంది ఇళ్లల్లోనే చిక్కుకుపోయారు. వియా డెల్‌ మార్‌లో దాదాపు 200 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు.

Details 

1,600 మంది పూర్తిగా నిరాశ్రయులయ్యారు

ఆదివారం విలేకరుల సమావేశంలో అండర్ సెక్రటరీ మాన్యువల్ మోన్సాల్వే మాట్లాడుతూ, ఇప్పటివరకు 112 మంది మరణించారని,వారిలో 32 మృతదేహాలను గుర్తించామని" అని చెప్పారు. వినా డెల్ మార్ చుట్టుపక్కల ప్రాంతంలో, 1931లో స్థాపించిన ప్రఖ్యాత బొటానికల్‌ గార్డెన్‌ కాలిబూడిదైంది. ఈ కారుచిచ్చు కారణంగా దాదాపు 1,600 మంది పూర్తిగా నిరాశ్రయులయ్యారు చిలీ తీరప్రాంత నగరాలను పొగ చుట్టుముట్టడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రధాన ప్రాంతాల్లోని నివాసితులు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. మంటల తీవ్రత అధికంగా ఉన్న వియా డెల్‌ మార్‌ పట్టణంలో పరిస్థితులు దయనీయంగా మారడంతో అధ్యక్షుడు గాబ్రియెల్‌ బోరిక్‌ రెండు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు.

Details 

ఫిబ్రవరి 2023లో 400,000 హెక్టార్లలో మంటలు 

చిలీ అధ్యక్షుడు బోరిక్ శనివారం ఒక టెలివిజన్ ప్రకటనలో రక్షణ మంత్రిత్వ శాఖ అదనపు సైనిక సిబ్బందిని ప్రభావిత ప్రాంతాలకు పంపుతుందని, అవసరమైన అన్ని సామాగ్రిని అందజేస్తుందని చెప్పారు. ఫిబ్రవరి 2023లో, దేశంలో మంటలు 400,000 హెక్టార్లకు పైగా వ్యాపించాయి. అప్పట్లో 22 మందికి పైగా మరణించారు.