Page Loader
China: ఆత్మహత్యా, చిత్రహింసలా, అదృశ్యమైన చైనా నాయకుడిపై ఆందోళన
ఆత్మహత్యా, చిత్రహింసలా, అదృశ్యమైన చైనా నాయకుడిపై ఆందోళన

China: ఆత్మహత్యా, చిత్రహింసలా, అదృశ్యమైన చైనా నాయకుడిపై ఆందోళన

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 07, 2023
06:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో అదృశ్యమైన కిన్‌గాంగ్‌ (Qin Gang) అదృశ్యమయ్యారు. ఈ మేరకు ఆయన ప్రాణాలతో లేరని తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ధిక్కరించిన ప్రముఖులు అదృశ్యమైన ఘటనలు చైనాలో చాలా జరుగుతుంటాయి. అలా మిస్ అయిన వ్యక్తే కిన్‌ గాంగ్‌. సాక్షాత్తూ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే జాడ లేకుండాపోయారు. ఈ క్రమంలోనే ఆయన చనిపోయి ఉంటారని పలు అంతర్జాతీయ వార్తా కథనాలు వెలువరిస్తున్నాయి. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడమో లేక చిత్రహింసల వల్ల మరణించి ఉండొచ్చని రాసుకొచ్చాయి. జులై నెలలోనే బీజింగ్‌లోని మిలిటరీ ఆస్పత్రిలో ఆయన మృతి చెందారని చైనా ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలున్న ఇద్దరు వ్యక్తులను ఉటంకించాయి.సదరు ఆస్పత్రిలో చైనాలోని ఉన్నతస్థాయి వ్యక్తులకు మాత్రమే చికిత్స అందిస్తారు.

DETAILS

డ్రాగన్ దేశ అధ్యకుడికి కిన్‌గాంగ్‌ అత్యంత సన్నిహితుడు

కిన్‌గాంగ్‌(Qin Gang) గతేడాది డిసెంబరులోనే విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు అమెరికాలో చైనా(China) రాయబారిగా ఉన్న ఆయనకు స్వయంగా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పదోన్నతి ఇచ్చేశారు. అనంతరం కొద్దినెలల నుంచి ఆయన అధికారిక కార్యక్రమాలకు గైర్హాజయ్యారు. చివరిగా ఈ ఏడాది జూన్‌లో బీజింగ్‌లో జరిగిన భేటీలో శ్రీలంక, వియత్నాం, రష్యా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. తర్వాత నుంచి ఆయన ఎక్కడా కనిపించకపోగా, అనారోగ్య కారణాలతో రాలేదని అప్పట్లో విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొద్దిరోజుల తర్వాత ఆయన పదవి కూడా గల్లంతైంది.ఆయన స్థానంలో వాంగ్‌ యీని నియమించింది. కిన్‌గాంగ్‌(Qin Gang),చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు పొందారు. ఆయన సహకారంతోనే చైనా విదేశాంగ విధానంలో అత్యంత బలమైన నేతగా ఎదగడం గమనార్హం.