
వివాదాస్పద మ్యాప్ పై భారత్ తీవ్ర స్పందనకు బదులిచ్చిన డ్రాగన్ దేశం
ఈ వార్తాకథనం ఏంటి
చైనా మరోసారి కయ్యానికి కాలు దువ్వుతోంది.ఈ మేరకు భారతదేశంలోని భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపిస్తూ సోమవారం చైనా అధికారికంగా ఓ మ్యాప్‌ను విడుదల చేసింది.
అయితే దీనిపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. భారత భూభాగాలను చైనా మ్యాప్‌లో పొందుపర్చడాన్ని ఖండించింది.ఈ అంశంపై బుధవారం చైనా స్పందించింది.
చట్ట ప్రకారమే మ్యాప్ ప్రకటించామని మళ్లీ పాత పాటే పాడింది. డ్రాగన్ దేశం తన దుశ్చర్యలను సమర్థించుకుంది. 2023కి సంబంధించి చైనా సోమవారం విడుదల చేసిన ఓ స్టాండర్డ్ మ్యాప్ (standard map) తీవ్ర దుమారం రేపింది.
సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాలు సహా అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్, తైవాన్, దక్షిణ చైనా సముద్రాలను తమ దేశంలోని భూభాగాలుగా ఆ మ్యాప్‌లో వివరించింది.
DETAILS
వివాదాస్పద చేష్టలతో సరిహద్దు వివాదాలను మరింత రగల్చడమే చైనా పని : భారత్
అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా పేర్కొనడంపై భారత్ భగ్గుమంది. ఇలాంటి చేష్టలతో సరిహద్దు వివాదాలను మరింత రగల్చడమేనని మండిపడింది.
ఎటువంటి ప్రామాణికం లేకుండా, ఆధారరహితంగా సదరు మ్యాప్‌ను చైనా రూపొందించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మేరకు దౌత్యపరమైన మార్గాల్లో చైనాకు గట్టి నిరసన వ్యక్తం చేశామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందర్ బాగ్చి తెలిపారు.
చైనా విడుదల చేసిన ప్రామాణిక మ్యాప్ ను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తోసిపుచ్చారు.అసంబద్ధమైన వాదనలతో ఇతరుల భూభాగాలు తమ(చైనా)కు చెందినని కావని చురకలు అంటించారు.
1950 దశకాల నుంచి చైనా ఇదే రీతిలో ప్రవర్తిస్తోందని, వారికిది కొత్తేమీ కాదని ఆయన ఎద్దేవా చేశారు. మ్యాప్‌లో ప్రాంతాలను మార్చడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదన్నారు,