China-Pakistan: పాక్‌కు చైనా J-35AE జెట్‌లు.. భారత్‌కు కొత్త సవాల్
ఈ వార్తాకథనం ఏంటి
చైనా మరోసారి తన మిత్రదేశం పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తోంది. తాజాగా తన అధునాతన స్టెల్త్ ఫైటర్ జెట్ J-35A స్టెల్త్ ఫైటర్ జెట్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ట్విన్ ఇంజన్‌తో రూపొందిన ఈ 5వ తరం యుద్ధవిమానం శత్రుదేశాల రాడార్‌లకు చిక్కకుండా దాడులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. గగనతలం మాత్రమే కాకుండా భూభాగ లక్ష్యాలపై కూడా ఇది సమర్థంగా దాడులు చేయగలదు. ఈ వీడియో విడుదలతో చైనా, పాకిస్తాన్‌కు 30 నుంచి 40 జె-35ఏఈ జెట్‌లను విక్రయించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 2026 మధ్య నాటికి వీటి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా.
వివరాలు
ఇరు దేశాల మధ్య సైనిక భాగస్వామ్యం మరింత బలపడింది
ఇప్పటికే పాకిస్తాన్ చైనా నుంచి J-10C fighter jetలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జె-35ఏఈ డీల్ కుదిరితే ఇరు దేశాల మధ్య సైనిక భాగస్వామ్యం మరింత బలపడనుంది. ఈ పరిణామం భారత్‌కు సవాళ్లు విసరొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 5వ తరం స్టెల్త్ టెక్నాలజీతో కూడిన ఈ యుద్ధవిమానం శత్రువులకు కనిపించకుండా దాడులు చేయడం ప్రత్యేకత. దీన్ని అమెరికా అభివృద్ధి చేసిన F-35 Lightning II, F-22 Raptorలతో పోలుస్తున్నారు. ఇప్పటికీ భారత్ వద్ద 5వ తరం యుద్ధవిమానాలు లేవు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన Rafale fighter jetను 4.5 జనరేషన్ జెట్‌గా పరిగణిస్తారు.
వివరాలు
త్వరతగతిన నిర్ణయం తీసుకోవాలి
ఇదే సమయంలో రష్యా, Sukhoi Su-57 యుద్ధవిమానాన్ని కొనుగోలు చేయాలని భారత్‌కు ఆఫర్ ఇచ్చింది. అయితే దీనిపై భారత్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ పాకిస్తాన్‌కు జె-35ఏఈ జెట్‌లు అందితే, ఆ దేశ ఎయిర్ పవర్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సమతుల్యత కోసం భారత్ కూడా 5వ తరం యుద్ధవిమానాలపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.