China warns US: 'మధ్యలో జోక్యం వద్దు': అమెరికాకు చైనా గట్టి హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్‌తో తమకు ఉన్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది. ఇదే సమయంలో హర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలన్న అమెరికా ఆలోచనను తీవ్రంగా ఖండించింది. ఈ విషయంపై చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం బీజింగ్ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న పరిణామాలను సమగ్రంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. హర్మూజ్ జలసంధిలో చైనా నౌకల కార్యకలాపాలు నిరంతరం కొనసాగుతున్నాయని చెప్పారు.
వివరాలు
హర్మూజ్ జలసంధి ఇరాన్ ఆధీనంలోనే కొనసాగుతుంది: చైనా
ఇరాన్‌తో కుదిరిన వాణిజ్య, ఇంధన ఒప్పందాలను గౌరవించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని బీజింగ్ స్పష్టం చేసింది. ఈ వ్యవహారాల్లో ఇతర దేశాలు, ముఖ్యంగా అమెరికా జోక్యం అవసరం లేదని గట్టిగా హెచ్చరించింది. హర్మూజ్ జలసంధి ఇరాన్ ఆధీనంలోనే కొనసాగుతుందని, చైనా నౌకలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని తెలిపింది. అదేవిధంగా యుద్ధ పరిస్థితులను ముగించేందుకు చైనా తన మద్దతును మరోసారి తెలియజేసింది. హర్మూజ్ జలసంధి భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మార్గంలో నౌకల రవాణా ఎటువంటి అంతరాయం లేకుండా సాగాలని పిలుపునిచ్చింది.