
USA: పౌరసత్వ పరీక్షలు ఇక తేలిక కాదు.. అమెరికా వీసా విధానాల్లో సంస్కరణలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వీసా, పౌరసత్వ విధానాల్లో కఠినతరం దిశగా ఆలోచనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల కోసం వీసా విధానాన్ని సంస్కరించనున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కొత్త డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లౌ వెల్లడించారు. ఓ అంతర్జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అమెరికా పౌరసత్వ పరీక్షలను మరింత క్లిష్టతరం చేయాలన్న యోచనలో ఉన్నట్లు చెప్పారు.
Details
బట్టి సమాధానాలు ఇక చెల్లవు
ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలు తక్కువ స్థాయిలో ఉండి, విద్యార్థులు బట్టీ పట్టి ఇచ్చే సమాధానాల్లా మారాయని వ్యాఖ్యానించారు. అంతేకాక, అమెరికా ఆర్థిక వ్యవస్థకు హెచ్-1బీ వీసా ఎలా ఉపయోగపడాలో మరోసారి సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. ట్రంప్ అధ్యక్ష పదవీ కాలంలోనే ఈ విధానాల్లో మార్పులు ప్రారంభమయ్యాయని, అయితే ఆయన తర్వాత అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ ఆ మార్పులను రద్దు చేశారని జోసెఫ్ ఎడ్లౌ గుర్తుచేశారు.