Page Loader
Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు
పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు

Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రాన్స్‌లో జరిగిన ఛాంపియన్స్ లీగ్‌ పోటీల్లో ప్యారిస్‌ సెయింట్‌-జర్మైన్‌ (PSG) జట్టు ఇంటర్ మిలన్‌పై గెలుపొందింది. ఈ విజయాన్ని జరుపుకునేందుకు వేలాది మంది అభిమానులు పారిస్‌ వీధుల్లోకి వచ్చారు. అయితే ఈ సంబరాలు హింసాత్మకంగా మారాయి. పీఎస్‌జీ, ప్రత్యర్థి జట్టు అభిమానుల మధ్య వాగ్వాదాలు పెరిగి ఘర్షణగా మారాయి. ఈ ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, 192మంది గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. వేడుకలు ఉద్రిక్తతలకు దారి తీయడంతో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి.

Details

బాష్పవాయువు ప్రయోగించిన ఆందోళనకారులు

ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు ప్రయోగించారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. బస్‌ షెల్టర్లను ధ్వంసం చేశారు. అలాగే, దుకాణాల్లోకి చొరబడి వస్తువులను దోచుకున్నారు. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులు కూడా చేశారు. ఫుట్‌బాల్‌ అభిమానుల మధ్య కలిసిపోయిన అసాంఘిక శక్తులే ఈ విధ్వంసానికి కారణమని అధికారులు అభిప్రాయపడ్డారు. ఘర్షణలకు సంబంధించి ఇప్పటివరకు 559మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.