Page Loader
Nobel Prize 2023: అర్థశాస్త్రంలో క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ బహుమతి 
Nobel Prize 2023: అర్థశాస్త్రంలో క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ బహుమతి

Nobel Prize 2023: అర్థశాస్త్రంలో క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ బహుమతి 

వ్రాసిన వారు Stalin
Oct 09, 2023
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్‌కు స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్ బహుమతిని ప్రకటించింది. 2023 ఏడాదికి గానూ అర్థశాస్త్రంలో ఆమెను నోబెల్ బహుమతి వరించింది. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం 2023స్వెరిజెస్ రిక్స్‌బ్యాంక్ బహుమతిని క్లాడియా గోల్డిన్‌కు అందించాలని నిర్ణయించారు. శతాబ్దాలుగా మహిళల సంపాదన,కార్మిక మార్కెట్ భాగస్వామ్యానికి సంబంధించిన సమగ్ర పరిశోధన గ్రంధాన్ని క్లాడియా గోల్డిన్ రూపొందించారు. దీనికి గాను ఆమెను ఈ గౌరవం లభించింది. గతేడాది ఆర్థిక శాస్త్రంలో ఈ నోబెల్ బహుమతిని ముగ్గురికి అందించారు. ప్రైజ్ మనీ కింద క్లాడియా గోల్డిన్‌ 11 మిలియన్ స్వీడిష్ క్రౌన్‌ను అందించనున్నారు. 1946లో న్యూయార్క్‌లోని క్లాడియా గోల్డిన్‌లో జన్మించిన గోల్డిన్ కేంబ్రిడ్జ్‌లోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నోబెల్ కమిటీ చేసిన ట్వీట్