
Donald Trump: ట్రంప్‌కు భారీ షాక్.. అధ్యక్ష పదవికి అనర్హుడి ప్రకటించిన కొలరాడో హైకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ సిద్ధమవుతున్న డొనాల్డ్ ట్రంప్ భారీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
జనవరి 6, 2021 నాటి యూఎస్ కాపిటల్ హింస కేసులో కొలరాడో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ట్రంప్ అధ్యక్ష పదవికి అనర్హుడని ప్రకటించింది.
దీంతో పాటు ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయకుండా కోర్టు అనర్హత వేటు వేసింది.
కోర్టు తీర్పుతో ఇప్పుడు ట్రంప్ వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేరు.. అలాగే ఓటు కూడా వేయలేరు.
రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3ని ఉపయోగించి అధ్యక్ష అభ్యర్థిని అనర్హులుగా ప్రకటించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి.
ట్రంప్‌కు వ్యతిరేకంగా అమెరికా కొలరాడో కోర్టు 4-3తేడాతో తీర్పు ఇచ్చింది.
అమెరికా
డోనాల్డ్ ట్రంప్‌కు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం
కొలరాడో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.
జనవరి 6, 2021న అమెరికా పార్లమెంటుపై అంటే క్యాపిటల్‌పై దాడికి డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులను హింసకు ప్రేరేపించారని గతంలో జిల్లా దిగువ కోర్టు తీర్పు చెప్పింది.
అయితే ట్రంప్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించలేమని అప్పుడు జిల్లా కోర్టు పేర్కొంది.
ఇప్పుడు జిల్లా కోర్టు తీర్పును తోసిపుచ్చిన కొలరాడో హైకోర్టు.. హింసను ప్రేరేపించిన ట్రంప్ ఎన్నికల్లో పోటీకి అనర్హుడని ప్రకటించింది.
ఈ తీర్పును జనవరి 4వ తేదీ వరకు నిలుపుదల చేస్తున్నట్లు.. ఈలోగా ట్రంప్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది.