Loading...
Malawi's fuel crisis: పెట్రోల్ కొరతతో అల్లాడుతున్న మలావి ప్రజలు.. బ్లాక్ మార్కెట్‌లో భారీ ధరలు
పెట్రోల్ కొరతతో అల్లాడుతున్న మలావి ప్రజలు.. బ్లాక్ మార్కెట్‌లో భారీ ధరలు

Malawi's fuel crisis: పెట్రోల్ కొరతతో అల్లాడుతున్న మలావి ప్రజలు.. బ్లాక్ మార్కెట్‌లో భారీ ధరలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్రికా దేశమైన మలావిలో ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ఒకప్పుడు పెట్రోల్ బంకుకు వెళ్లి నిమిషాల్లో ఇంధనం నింపుకొని వచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు గంటల తరబడి క్యూలో నిలబడినా పెట్రోల్ దొరుకుతుందో లేదో తెలియని దుస్థితి నెలకొంది. పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంధనం కోసం రాత్రంతా బంకుల వద్దే వేచి ఉండాల్సి వస్తోంది. సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో రవాణా రంగంతో పాటు చిన్న వ్యాపారాలపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. మరోవైపు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు ఇంధనం విక్రయిస్తుండటంతో సామాన్యులపై ఆర్థిక భారం పెరుగుతోంది.

వివరాలు 

నాలుగు గంటలు క్యూలో ఉంటేనే 20 లీటర్ల పెట్రోల్!

మలావిలోని బ్లాంటైర్ నగరానికి చెందిన 40 ఏళ్ల కెన్ మ్హాంగో అనుభవం అక్కడి ఇంధన కొరత తీవ్రతను తెలియజేస్తోంది.

ఆయన వాహనాల కొనుగోలు, అమ్మకాల వ్యాపారం నిర్వహిస్తున్నారు.

అయితే కొన్ని రోజులుగా పెట్రోల్ దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఓ పెట్రోల్ ట్యాంకర్ వస్తోందని స్నేహితుడు సమాచారం ఇవ్వడంతో సమీపంలోని బంకుకు వెళ్లారు. అప్పటికే అక్కడ 12మంది క్యూలో ఉన్నారు.

కొద్దిసేపటికే మినీ బస్సుల డ్రైవర్లు, మోటార్ సైకిల్ టాక్సీ నిర్వాహకులు వచ్చి క్యూను దాటేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

దీంతో తోపులాటలు,వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.

చివరకు నాలుగు గంటల పాటు వేచి చూసిన తర్వాత ఆయనకు 20 లీటర్ల పెట్రోల్ లభించింది. మరికొందరు మాత్రం ఇంధనం కోసం రాత్రంతా బంకుల వద్దే గడుపుతున్నారు.

వివరాలు 

బంకుల వద్ద ఘర్షణలు.. ప్రాణాలు తీస్తున్న ఇంధన కొరత

పెట్రోల్ కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో బంకులకు చేరుకుంటుండటంతో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు హింసాత్మకంగా మారుతున్నాయి.

బంకులకు ఇంధనం ఎప్పుడు వస్తుందనే విషయంపై అధికారులు రోజువారీ షెడ్యూళ్లు ప్రకటిస్తున్నప్పటికీ.. ట్యాంకర్లు సమయానికి చేరుకుంటాయన్న భరోసా లేకుండా పోయింది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. బ్లాంటైర్‌లో ఇంధనం కోసం ఏర్పడిన గందరగోళంలో ఓ వాహనం ఢీకొనడంతో పెట్రోల్ బంకు ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు.

మరోవైపు బ్లాంటైర్ మేయర్‌పై కూడా పెట్రోల్ క్యూ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి దాడి ఆరోపణలతో కేసు నమోదైంది.

ప్రస్తుతం ఒక్కో వాహనదారుడికి రోజుకు గరిష్ఠంగా 20 లీటర్ల వరకు మాత్రమే ఇంధనం అందిస్తున్నట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

బ్లాక్ మార్కెట్‌లో భారీ ధరలు

బంకుల్లో పెట్రోల్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు అక్రమ విక్రయదారులను ఆశ్రయిస్తున్నారు.

కెన్ మ్హాంగో తన తండ్రి అవసరాల కోసం కేవలం రెండు లీటర్ల పెట్రోల్‌ను 30,000 మలావియన్ క్వాచాలు (సుమారు 17.31 డాలర్లు) చెల్లించి కొనుగోలు చేశారు.

గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ గణాంకాల ప్రకారం.. మలావిలో లీటరు పెట్రోల్ ధర సుమారు 3.24 డాలర్లుగా ఉంది.

ప్రపంచ సగటు ధర 1.52 డాలర్లతో పోలిస్తే ఇది రెండింతలకుపైగా కావడం గమనార్హం. అక్కడ అనుమతి లేకుండా పెట్రోల్ విక్రయించడం చట్టవిరుద్ధం.

అయినప్పటికీ ఇంధన కొరతను అవకాశంగా మలుచుకుంటున్న కొందరు అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

ఇదిలా ఉంటే సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇళ్లలో పెట్రోల్ నిల్వ చేయడం కూడా ప్రమాదకరంగా మారింది.

ADVERTISEMENT

వివరాలు 

వ్యాపారాలు కుదేలు.. కుటుంబ పోషణకూ ఇబ్బందులు

దీంతో అగ్నిప్రమాదాలు, పేలుళ్లు సంభవిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇంధన పేలుళ్ల కారణంగా కనీసం ఆరుగురు మరణించినట్లు మలావికి చెందిన నేషన్ పత్రిక వెల్లడించింది.

ఇంధన కొరత ప్రభావం వాహనదారులకే పరిమితం కాలేదు. చిన్న వ్యాపారాలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

కెన్ మ్హాంగో నిర్వహిస్తున్న గ్యారేజీకి గతంలో వాహనాల మరమ్మతుల కోసం పెద్ద సంఖ్యలో కస్టమర్లు వచ్చేవారు.

అయితే ఇప్పుడు పెట్రోల్ కొరత కారణంగా వాహనాలను నడపలేకపోతుండటంతో గ్యారేజీకి వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

దీంతో వ్యాపారం మందగించిందని, ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా కష్టంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

లింబే ప్రాంతానికి చెందిన మోటార్ సైకిల్ టాక్సీ డ్రైవర్ తడాలా కచింగ్వే పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

వివరాలు 

ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి

గతంలో రోజువారీ సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకునేవారు. ప్రస్తుతం ఇంధనం సరిగా లభించకపోవడంతో ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది.

కుటుంబానికి ఉదయం అవసరమైన ఆహార పదార్థాలు కొనుగోలు చేయడానికి కూడా డబ్బులు మిగలడం లేదని ఆయన వాపోతున్నారు.

మలావిలో ఇంధన కొరతతో పాటు విద్యుత్ కోతలు, విదేశీ మారకద్రవ్య సమస్యలు కూడా ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

దీంతో ప్రభుత్వంపై అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సమస్యలపై నిరసనగా నవంబర్ 17న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని మానవ హక్కుల సంఘాల కూటమి (HRDC) నిర్ణయించింది.

ఇంధన శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అయితే నిరసనలకు తగిన భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పడంతో ఆందోళనలను వాయిదా వేసింది.

వివరాలు 

ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి

మరోవైపు ఇంధన సరఫరాలో అంతరాయాలకు గల కారణాలపై మలావి ఇంధన మంత్రిత్వ శాఖ స్పందించింది.

ఇంధన దిగుమతులకు అవసరమైన నిధుల కొరత, విదేశీ మారకద్రవ్య సమస్యలు, రవాణాపరమైన ఇబ్బందుల వల్లే సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని వివరించింది.

ఇంధన సరఫరాను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.

ADVERTISEMENT